గ్లోబల్ స్టార్ కోసం సీన్ లోకి…. మ్యాన్ ఆఫ్ మాసెస్, రెబల్ స్టార్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ గా మార్చింది త్రిబుల్ ఆర్ మూవీ. ఆ సినిమా తర్వాత ఆచార్య మూవీ వచ్చినా అందులో తనది గెస్ట్ రోల్ మాత్రమే.. కాబట్టి త్రిబుల్ ఆర్ తర్వాత తన రెండో పాన్ ఇండియా సినిమా అంటే గేమ్ ఛేంజరే అనుకోవాలి. అందుకే ఈ సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ గా మార్చింది త్రిబుల్ ఆర్ మూవీ. ఆ సినిమా తర్వాత ఆచార్య మూవీ వచ్చినా అందులో తనది గెస్ట్ రోల్ మాత్రమే.. కాబట్టి త్రిబుల్ ఆర్ తర్వాత తన రెండో పాన్ ఇండియా సినిమా అంటే గేమ్ ఛేంజరే అనుకోవాలి. అందుకే ఈ సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తోంది. త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి సాయం లేకుండా, హిట్ మెట్టెక్కగలనని ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు. ప్రభాస్ కూడా సాహో, సలార్, కల్కీతో ట్రెండ్ సెట్ చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు రామ్ చరణ్ వంతొచ్చింది. కాని తన గ్లోబల్ స్టార్ ఇమేజే తనకి పెద్ద హెడ్డేగ్ గా మారేలా ఉంది.. తన ఇమేజే తనకెందుకు ఇబ్బందిగా మారుతోంది? రామ్ చరణ్ కి తోడుగా ఎన్టీఆర్, ప్రభాస్ రంగంలోకి ఇప్పుడే ఎందుకు దిగుతున్నారనే ప్రచారం మొదలైంది? ఇంతకి ఏంజరగబోతోంది?
రామ్ చరణ్ కి గేమ్ చేంజర్ మూవీ, తన గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఈరెండూ పెద్ద హెడ్డేక్స్ గా మారాయి. ఒకవైపు శంకర్ మూవీ భారతీయుడు 2 ప్లాప్ అవటంతో, ఆ డైరెక్టర్ పనైపోయిందంటున్నారు. ఆ ఇంప్రెషన్ గేమ్ ఛేంజర్ మీద పడేలా ఉందని, ఏమాత్రం కథ అటు ఇటుగా ఉన్న గేమ్ ఛేంజర్ ఖేల్ ఖతం అనేస్తున్నారు.
మరో వైపు త్రిబుల్ ఆర్ హిట్ తర్వాత చరణ్ తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తోంది. త్రిబుల్ ఆర్ హిట్ తోపాటు నాటు నాటు సాంగ్ తో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ కి తగ్గ హిట్ పడాలంటే, గేమ్ ఛేంజర్ వందలకోట్లు రాబట్టాలి.. కాని అదే సాధ్యమౌతుందా.. అన్నడౌట్లు పెరిగాయి
పాటలు తూటాల్లా పేలట్లేదు. టీజర్ కి పెద్దగా రెస్పాన్స్ లేదు. అన్నీంటికి మించి శంకర్ వల్లే గేమ్ ఛేంజర్ మీద అంచనాలు అర అడుగు కూడా పైకి వెళ్లేలా లేవు… కారణంనన్బన్, ఐ, రోబో 2.0, భారతీయుడు 2 ఇలా వరుసగా ఫ్లాపులే సొంతం చేసుకున్నాడు శంకర్. అందుకే తన పనైపోయిందంటున్నారు.
అలాంటి డైరెక్టర్ మరో ప్లాప్ సిద్దం చేశాడనే కామెంట్లు, ట్రోలింగ్స్ మొదలయ్యాయి. వీటిని తట్టుకోవాలంటే, గేమ్ ఛేంజర్ మిరాకిల్ చేయాలి. వసూల్ల వరద తేవాలి.. అది కంటెంట్ లో దమ్ముంటే సాధ్యమే కాని, శంకర్ అంత కెంటెంట్ తో వస్తున్నాడా అన్నదే డౌట్…ఏదేమైనా రిలీజ్ కిముందే రిజల్ట్ ని తీసి పారేయలేం. కాని ఈమూవీకి ఎంత కష్టపడ్డా పెద్దగా హైప్ రావట్లేదు. నార్త్ ఇండియాలో టీజర్ లాంచ్ చేసినా పెద్దగా ప్రయోజనం లేదు
అందుకే సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రాబోతున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రామ్ చరణ్ మూవీకోసం అడుగు ముందుకేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ మూవీ కోసం 70 కోట్లు ఖర్చు చేసిదిల్ రాజు ఏకంగా ఐదు ఈవెంట్లు ప్లాన్ చేశాడు. యూఎస్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పుష్ప డైరెక్టర్ సుకుమార్ వస్తుంటే, హైద్రబాద్ ఈవెంట్ కి తన ఫ్రెండ్ ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారట. ఇక పూనా ఈవెంట్ కి రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వస్తాడంటూ ప్రచారం పెరిగింది. మొత్తంగా యూఎస్, హైద్రబాద్, పూనా, ఈవెంట్లతో రామ్ చరణ్ మూవీ గేమే ఛేంజ్ అయ్యేలా ఉంది.