ప్రభాస్, ఎన్టీఆర్ దెబ్బకు.. బాలీవుడ్ కి మళ్లీ వణుకు…!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఇద్దరి పేర్లు లేకుండా... వీళ్ల వార్త లేకుండా బాలీవుడ్ జనాలకు నిద్ర పట్టదనకుంటా... ఏదోలా వీళ్ల నామస్మరణే ప్రతీ వారం అక్కడ కనిపిస్తోంది. వినిపిస్తోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఇద్దరి పేర్లు లేకుండా… వీళ్ల వార్త లేకుండా బాలీవుడ్ జనాలకు నిద్ర పట్టదనకుంటా… ఏదోలా వీళ్ల నామస్మరణే ప్రతీ వారం అక్కడ కనిపిస్తోంది. వినిపిస్తోంది. ఇప్పుడు కూడా అంతే… ది రాజా సాబ్ రిలీజ్ కి ముందయ్యే బిజినెస్ తో అక్కడ హీరో గుండెల్లో బుల్లెట్ రైల్లు పరుగెడుతున్నాయి. దీ రాజా సాబ్ ఓటీటీ రైట్స్ కి ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ 330 కోట్ల ఆఫర్ ఇచ్చింది. నార్త్ ఇండియా రైట్స్ ఏకంగా 470 కోట్ల ధర పలుకుతోంది. అన్ని భాషల ఓవర్ సీస్ రైట్స్ కి 290 కోట్ల లెక్క తేలింది. మొత్తంగా ఈ లెక్కతోనే 1090 కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఇంకా తెలుగు, తమిల్, మలయాళ, కన్నడ రైట్స్ డీల్ సెట్ కాలేదు. అవి కూడా తోడైతే ఈ మూవీ రిలీజ్ కి ముందే 1500 కోట్ల బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. విచిత్రం ఏంటంటే డ్రాగన్ విషయంలో కూడా ఇలాంటి డిస్కర్షనే జరుగుతోంది. మధ్యలో వార్ 2 మూవీ రిలీజ్ ఉన్నా, అప్పుడే డ్రాగన్ ప్రీరిలీజ్ బిజినెస్ చర్చ లు జరగటంచూస్తే, బాలీవుడ్ హీరోలకి నిద్రపట్టేలా లేదు. హిందీ మూవీ వార్ 2 బాలీవుడ్ ని కాపాడే అవకాశాలున్నా, ఎన్టీఆర్ పుణ్యమాని అది టాలీవుడ్ ఎకౌంట్ లోనే పడుతోంది. ఇంతకి ఈ వ్యవహారానికి బాలీవుడ్ హీరోల టెన్షన్ కి లింకేంటి?
రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ రిలీజ్ కి ముందే 1500 కోట్ల వరకు బిజినెస్ చేసేలా ఉంది. అందులో 1090 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ డీల్స్ ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయినట్టే కనిపిస్తున్నాయి. ఇక డ్రాగన్ సెట్స్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టనే లేదు. ఇంతలోనే డ్రాగన్ తాలూకు ప్రిరిలీజ్ బిజినెస్ చర్చ లు మొదలయ్యాయి. దీంతో నిజంగా పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమాకున్న డిమాండ్, ఎంతగా రీసౌండ్ చేస్తుందో తెలుస్తోంది
ప్రజెంట్ ది రాజా సాబ్ ఓటీటీ రైట్స్ 330 కోట్లనగానే అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే పుష్ప2 రిలీజ్ కి ముందే 270 కోట్లకు ఓటీటీ రైట్స్ సేల్ అయ్యిందన్న వార్తే, బాలీవుడ్ ని వనికి స్తోంది. 1800 కోట్ల వసూళ్లు కూడా హిందీ హీరోలని నిద్రపట్టకుండా చేస్తోందంటున్నారు
ఆల్రెడీ హిందీ ప్రొడ్యూసర్ భోనీ కపూర్ తో నాగవంశీ తాలూకు హిందీ చిట్ చాట్ వివాదమైంది. హిందీవోల్లకి సినిమా తీయటం రాలేదన్న తన ఎనాలసిస్ మీద హిందీ దర్శక నిర్మాతలు మండిపడ్డారు. కాని హిందీ ఆడియన్స్ మాత్రం బాలీవుడ్ దర్శక నిర్మాతలకు బుద్దిరాదని కామెంట్లతో టాలీవుడ్ కే సపోర్ట్ చేస్తున్నారు
ఇలాంటి టైంలో ది రాజా సాబ్ మూవీ ఓటీటీ రైట్స్ 330 కోట్లని తేలటం, ధర్మ ప్రొడక్షన్స్అండ్ కో కలిసి ది రాజా సాబ్ హిందీ రైట్స్ కి 470 కోట్లు కోట్ చేయటం తో, బాలీవుడ్ షేక్ అవుతోంది. నార్త్ లో బన్నీ, తారక్ కంటే ముందే వెయ్యికోట్లని రెండు సార్లు రాబట్టిన ప్రభాస్ కి, అక్కడ డై హార్ట్ ఫ్యాన్స్ ఎక్కువ
సో దేవర నార్త్ లో 370 కోట్లు, పుష్ప 800 కోట్లు రాబట్టింది. సో ది రాజా సాబ్ ఈజీగా నార్త్ లోనే వెయ్యికోట్లు రాబట్టే ఛాన్స్ఉంది. అందుకే 470 కోట్లతో హిందీ వర్షన్ రైట్స్ డీల్ సెట్ అయ్యిందంటున్నారు. ఇక యూఎస్ లో అన్ని భాషల రైట్స్ కి 290 కోట్లకు సేల్ చేస్తున్నరట. వీటికే 1090 కోట్ల వరకు లెక్కతేలుతోంది.అలాంటిది తెలుగు,తమిళ్, మలయాళ, కన్నడ రైట్స్ కి, శాటిలైట్ రైట్స్ తో కలిపి 500 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే విడుదలకు ముందే ది రాజా సాబ్ 1500 కోట్లు రాబ్టటేలా ఉండటం నిజంగా హిందీ హీరోలకు నిద్రలేని రాత్రులనే క్రియేట్ చేస్తోంది
లాస్ట్ ఇయర్ 5 పాన్ ఇండియా హిట్లు ఇచ్చిన టాలీవుడ్, ఈ సారి గేమ్ ఛేంజర్, ది రాజా సాబ్ తో భారీ ఎటాక్ కి సిద్దమైంది. విచిత్రం ఏంటంటే హిందీ మూవీ వార్ 2 ఆగస్ట్ లో వస్తున్నా, అది 2000 కోట్ల సినిమా అంటూ అంచనాలు పెరగుతున్నా? అదేదో ఎన్టీఆర్ మూవీ మాత్రమే అన్నట్టు భావన పెరిగిపోతోంది. వార్2 హిట్ అయినా హ్రితిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ కే ఎక్కువ క్రెడిట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అందుకే తెలుగు సినిమాల రిలీజ్ లే కాదు, వాటి ప్రీరిలీజ్ బిజినెస్ లు కూడా బాలీవుడ్ ని వణికేలా చేస్తోంది.