GUNTUR KAARAM: మహేశ్ మూవీ మీద ఫైర్ అవుతున్న ప్రభాస్, పవన్ ఫ్యాన్స్
గుంటూరు కారం మీద ఏపీ ప్రభుత్వం మమకారం చూపించిందని, మిగతా మూవీల మీద కక్షకట్టిందని ఓ డిస్కర్షన్ మొదలు పెట్టారు. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన భీమ్లానాయక్‌కి ఏపీలో టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వలేదు.
GUNTUR KAARAM: గుంటూరు కారం మూవీ వరల్డ్ వైడ్‌గా సందడి మొదలు పెట్టింది. ఫిల్మ్ టీం చేసిన ప్రమోషన్, దిల్ రాజుతోపాటు మహేశ్ బాబు ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రభావం కనిపిస్తోంది. అంతవరకు ఓకే కాని, సడన్‌గా మహేశ్ బాబు మూవీ మీద పవన్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. గుంటూరు కారం మీద ఏపీ ప్రభుత్వం మమకారం చూపించిందని, మిగతా మూవీల మీద కక్షకట్టిందని ఓ డిస్కర్షన్ మొదలు పెట్టారు.
GUNTUR KAARAM REVIEW: ‘గుంటూరు కారం’ ఎలా ఉంది..? ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
గతంలో పవన్ కళ్యాణ్ చేసిన భీమ్లానాయక్‌కి ఏపీలో టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన బ్రో మూవీకి కూడా ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వలేదు. కాని గుంటూరు కారం మూవీకి 50 రూపాయలు అదనంగా టిక్కెట్ రేటు పెంచుకునే వెసులుబాటు ఇచ్చారట. అక్కడే పవన్ ఫ్యాన్స్‌కి మండిపోతోంది. నిజానికి గుంటూరు కారం మూవీ టిక్కెట్ రేటు 20 వరకే పెంచుకునే అవకాశం ముందు ఇచ్చి, తర్వాత దాన్ని 50 రూపాయల వరకు పెంచుకునేలా నిర్ణయం మార్చారని చర్చ కూడా జరుగుతోంది. పవన్ మీద కక్షతో తన సినిమాను తొక్కేసి, మహేశ్ మూవీకి సపోర్ట్ చేస్తున్నారని, ఇది ఖచ్చితంగా పక్షపాత వైఖరే అంటున్నారు. విచిత్రం ఏంటంటే సలార్‌కి ఏపీలో 40 రూపాయల వరకు అదనంగా టిక్కెట్ రేటు పెంచుకునే అవకాశం ఇచ్చినా, ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవటం ఆపలేదు.
అదేంటి ప్రభాస్ ఏపీ ప్రభుత్వానికి ఫ్రెండ్లీ హీరోనే కదా.. తన సినిమాకు 40 రూపాయాలు అదనంగా పెంచుకునే ఛాన్స్ ఇచ్చి, గుంటూరు కారం మూవీకి 50 పెంచుకునే చాన్స్ ఇవ్వటమేంటంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వందకోట్ల పైనే బడ్జెట్ ఉన్న మూవీలకే టిక్కెట్లు పెంచుకునే ఫెసిలిటీ ఇవ్వాలంటున్నారు. అలా చూస్తే రెమ్యునరేషన్లు వదిలేస్తే బీమ్లానాయక్, బ్రో వందకోట్ల మూవీలు కావనే మాటలు వినిపిస్తున్నాయి.