Prabhas: ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా.. పోలీసులతో వార్..

సందీప్ కొత్త గొడవ విషయానికొస్తే.. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ మూవీ తీస్తున్నాడు. టాకీ పార్ట్ అయిపోయింది. పాటల్ని అన్ని భాషల్లో తెరకెక్కిస్తూ బిజీ అయిన తను, ఆ తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్ అంటూ ఓ ప్రయోగం చేయబోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 14, 2023 | 05:52 PMLast Updated on: Aug 14, 2023 | 5:52 PM

Prabhas And Sandeep Reddy Vanga Movie Story Line Leaked Here Is The Details

Prabhas: సందీప్ రెడ్డి వంగా.. తన ఇంటిపేరులోనే ఉంది తనెప్పటికీ, ఎవ్వరికీ బెండ్ కాను అని. ఇలాంటివి సినిమాల్లో డైలాగ్స్‌లా బాగుంటాయి. కాని రియాలిటీకొస్తే సీన్ రివర్స్అవుతుంది. కాని సందీప్ మాత్రం రియల్ లైఫ్‌లో కూడా అర్జున్ రెడ్డిలానే కనిపిస్తాడు. అగ్రెసివ్‌గా దూసుకెళతాడు.

మాటలు, తన పనితనం రెండింట్లో తన రెబలిజమే కనిపిస్తుంది. ఇక సందీప్ కొత్త గొడవ విషయానికొస్తే.. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ మూవీ తీస్తున్నాడు. టాకీ పార్ట్ అయిపోయింది. పాటల్ని అన్ని భాషల్లో తెరకెక్కిస్తూ బిజీ అయిన తను, ఆ తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్ అంటూ ఓ ప్రయోగం చేయబోతున్నాడు. ఇది ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. ఐతే దీపావళి తర్వాతే ఈ సినిమా లాంఛ్ కాబోతుంది. 2024 సంక్రాంతి నుంచి షూటింగ్ జరిగేలా సందీప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతా బానే ఉంది. కాని పోలీసులతో గొడవేంటంటే.. స్పిరిట్ మూవీలో హీరో పోలీస్ పాత్ర వేస్తున్నాడట. అయితే పోలిసులతో ఇబ్బందనటానికి ఏమి ఉండదు. కాని ఇక్కడ సీన్‌లో ట్విస్ట్ ఉంది. తెలంగాణ పోలీస్ వర్సెస్ మహారాష్ట్ర పోలీస్ అనేలా స్టోరీ లైన్ ఉందట.

అంటే ఒక రాష్ట్ర పోలీసులతో మరో రాష్ట్ర పోలీసులకు ఫైట్. అయితే, ఈ మూవీ మీద మరాఠీలు ఊరుకుంటారా..? అసలు అక్కడి పోలీసులు అంగీకరిస్తారా..? ఇలాంటి డౌట్లు రాక తప్పదు. ఐతే అర్జున్ రెడ్డిలో హీరోని డాక్టర్‌గా చూపించి, యానిమల్‌లో హీరోని జంతువులా మార్చిన సందీప్.. స్పిరిట్‌లో మాత్రం హీరోని పోలీస్‌గా మారుస్తున్నాడు. మరి తెలంగాణ పోలీస్ వర్సెస్ మహారాష్ట్ర పోలీస్ అంటూ లీకైన స్టోరీ లైన్‌ని ఎలా తెరకెక్కించి మెప్పిస్తాడో కాని, ప్రస్తుతానికి సందీప్ పెద్ద రిస్కే చేస్తున్నాడని అనుకోవాల్సి వస్తోంది.