PRABHAS: స్పిరిట్ కోసం ముగ్గురు హీరోయిన్లు.. ప్రభాస్‌తో జోడీ కట్టేదెవరు..?
ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లోనే అంటున్నాడట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. జూన్‌లో స్పిరిట్‌ని లాంచ్ చేసి అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండొచ్చని గత ఇంటర్వూల్లో తేల్చాడు సందీప్ రెడ్డి వంగ. కాని సడన్‌గా సినిమా లాంచింగే డిసెంబర్‌కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Sandeep Reddy came in for Prabhas
PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి మూవీకి ఫినిషింగ్ టచ్ ఇస్తూనే ఉన్నాడు. మరోవైపు.. ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ కోసం కాల్ షీట్స్ ఇచ్చాడు. ఇక సలార్ 2 కోసం జూన్ నుంచి బిజీ కాబోతున్నాడు. అయితే, స్పిరిట్ పరిస్థితే ఆలస్యమయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లోనే అంటున్నాడట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.
Tillu Square: కథ లేకున్నా కలెక్షన్లు.. టాలీవుడ్ నయా ట్రెండ్..
జూన్‌లో స్పిరిట్‌ని లాంచ్ చేసి అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండొచ్చని గత ఇంటర్వూల్లో తేల్చాడు సందీప్ రెడ్డి వంగ. కాని సడన్‌గా సినిమా లాంచింగే డిసెంబర్‌కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవైపు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇంకోవైపు ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ హీరోయిన్ల వేట మొదలు పెట్టాడట. పూర్తి స్క్రిప్ట్ రెడీ కాకున్నా, హీరో, హీరోయిన్, విలన్ పాత్రల తాలూకు ప్లాట్ చూచాయగా రెడీ అయ్యిందట. సో బేసిక్ ప్లాట్ పర్ఫెక్ట్ గా రావటం వల్లే ఇక సీన్లు రాసుకుని కథ పూర్తిచేయటమే మిగిలి ఉంది. అందుకే హీరోయిన్ల వేట మొదలుపెట్టాడని తెలుస్తోంది. రష్మిక మందన్న స్పిరిట్ మూవీకి ఫస్ట్ ఆప్షన్ అని తెలుస్తోంది.
ఇక సెకండ్ ఆప్షన్‌గా కీర్తి సురేష్, మూడో ఆప్షన్‌గా మృణాళ్ ఠాకూర్‌ను అనుకున్నాడట. ఆల్రెడీ సీతారామం ఫేం హనురాఘవపూడితో ప్రభాస్ చేసే మూవీలో మృణాల్ ఫిక్స్ అవటంతో తనని స్పిరిట్‌కి తీసుకోకపోవచ్చనే అంచనాలున్నాయి. ఇక కీర్తి సురేష్ కూడా కేవలం చర్చల్లో వచ్చిన పేరే అంటున్నారు. ఎలా చూసినా రష్మిక మందన్నానే స్పిరిట్ కోసం సందీప్ రిపీట్ చేసే చాన్సెస్ ఉన్నాయి.