PRABHAS: హాలీవుడ్ రీమేక్.. ప్రభాస్ రూ.2000 కోట్ల బొమ్మ మిస్సయిపోయిందే..

స్పిరిట్ కంటే ముందు సందీప్‌తో, ప్రభాస్ మరో సినిమాను ప్లాన్ చేశాడన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభాస్, ఒకసారి సందీప్‌ను పిలిపించుకుని ఒక హాలీవుడ్ సినిమాను సజెస్ట్ చేసి.. రీమేక్ మనం చేద్దామని చెప్పాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2024 | 02:42 PMLast Updated on: Apr 10, 2024 | 2:42 PM

Prabhas Asked Sandeepreddy Vanga To Do A Hollywood Remake

PRABHAS: టాలీవుడ్‌లోనే కాదు.. యావత్ ఇండియాలో ఇప్పుడు యమ బిజీగా ఉన్న యాక్టర్ ఎవరా అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. మళ్లీ అవన్నీ ఆషామాషీ ప్రాజెక్ట్‌లు కావు. వందల కోట్ల బడ్జెట్‌తో ముడిపడి ఉన్నవి. అంతెందుకు ప్రభాస్ కూడా ఏ రోజు ఏ సినిమా షూటింగ్ చేస్తున్నాడో.. అక్కడికి వెళ్తే కానీ తెలియని పరిస్థితులో ఉన్నాడు. ఇక ‘బాహుబలి 2’ వంటి అరివీర భయంకర హిట్టు తర్వాత దాదాపు ఆరేళ్లకు సలార్‌తో ఆ రేంజ్ హిట్టు కొట్టాడు. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల మోత మోగించింది.

vijay devarakonda: విజయ్‌ దేవరకొండకి హ్యాండిచ్చిన శ్రీలీల..

ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన కల్కి రిలీజ్‌కు రెడీగా ఉంది. దీనితో పాటు రాజా సాబ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ రెండు సినిమాలతోపాటు ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమా కావడంతో ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. పైగా ప్రభాస్ ఇందులో పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు. ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌లో తొలిసారి ఖాకీ చొక్కా వేయనున్నాడు. ఒక సిన్సియర్, అగ్రెసివ్ పోలీస్ క్యారెక్టర్‌ను డార్లింగ్ ఈ సినిమాలో చేయబోతున్నాడని సందీప్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. స్పిరిట్ కంటే ముందు సందీప్‌తో, ప్రభాస్ మరో సినిమాను ప్లాన్ చేశాడన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభాస్, ఒకసారి సందీప్‌ను పిలిపించుకుని ఒక హాలీవుడ్ సినిమాను సజెస్ట్ చేసి.. రీమేక్ మనం చేద్దామని చెప్పాడట. అయితే సందీప్ మాత్రం రీమేక్ కాకుండా.. ఒరిజినల్ లోకల్ ఫ్లేవర్‌లో ఓ సినిమా చేద్దాం అని చెప్పి, కొన్ని రోజుల తర్వాత స్పిరిట్ స్టోరీ లైన్ వినిపించాడట.

ప్రభాస్‌కు అది బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అలా హాలీవుడ్ రీమేక్ అనుకున్న కథ.. కాస్త స్పిరిట్ అయింది. దాంతో డార్లింగ్ చేయాలనుకున్న ఆ హాలీవుడ్ సినిమా ఏంటా అని చర్చలు జరుగుతున్నాయి. అది మూడున్నర దశాబ్దాల కిందట వచ్చిన ‘రోడ్ హౌజ్’ సినిమా అని తెలుస్తుంది. యాక్షన్ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను రౌడీ హెర్రింగ్‌టన్ తెరకెక్కించాడు. ఇక స్పిరిట్ విషయానికొస్తే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు 60శాతం పూర్తయిపోయాయని తెలుస్తుంది. ఇదే ఏడాది ద్వితియార్థం చివర్లో ఈ సినిమాను పట్టాలెక్కించే చాన్స్ ఉంది. ఇక ఈ సినిమా కోసం కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు రూమర్ వినిపిస్తుంది. అదెంత వరకు నిజమా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన కల్కి రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ టాలీవుడ్ సహా అన్ని వుడ్‌లను ఊపేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా మే 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఏపీ ఎలక్షన్స్ కారణంగా సినిమా పోస్ట్‌పోన్ అయ్యే చాన్స్ ఉంది. తిరిగి మే 30న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరో వారం రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.