SORRY… మీ 1000 కోట్లకి మా హీరో అడ్డుపడ్డాడు..
రెబల్ స్టార్ వల్ల, తన ఇమేజ్ వల్ల మరో హీరోకి ఊహించని డ్యామేజ్ జరిగిపోయింది. ఇందులో ప్రభాస్ తప్పులేదు... కాని తనే పరోక్షంగా ఒక హీరోకి 1000 కోట్ల సంతోషం దక్కకుండా అయిపోయింది. ఫలితంగా 550 కోట్ల నష్టాన్ని కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది.
రెబల్ స్టార్ వల్ల, తన ఇమేజ్ వల్ల మరో హీరోకి ఊహించని డ్యామేజ్ జరిగిపోయింది. ఇందులో ప్రభాస్ తప్పులేదు… కాని తనే పరోక్షంగా ఒక హీరోకి 1000 కోట్ల సంతోషం దక్కకుండా అయిపోయింది. ఫలితంగా 550 కోట్ల నష్టాన్ని కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఆహీరో కి కలిసస్తున్న కాలంలోనే ఇదంతా జరిగింది. ఎక్కడా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యక్షంగా తప్పు చేయలేదు. తన తప్పుకి ఆస్కారమే లేదు. కాని రెబల్ స్టార్ కి పెరిగిన కొండంత ఇమేజ్ వల్లే, మరో హీరోకి ఊహించని డ్యామేజ్ జరిగింది. దీంతో ఆ డ్యామేజ్ కి కారణం దర్శకుడే అవటంతో, తనే రంగంలోకి దిగాడు. ప్రభాస్ లాంటి కటౌట్ ని మరో హీరో దారికి అడ్డంగా పెట్టడం వల్లే ఈ తప్పు జరిగిందని, అందుకు సారి అనేశాడు.. ఇంతకి ఏం జరిగింది.. రెబల్ స్టార్ ఇమేజ్ మరో హీరో డ్యామేజ్ కి ఎలా కారణమైంది?
రెబల్ స్టార్ ప్రభాస్ నమ్మిన కథని, నమ్మన దర్శక నిర్మాతలతో చేసుకుంటూపోయాడు. ఆ ప్రాసెస్ లో బాహుబలి, సాహో, సలార్, కల్కీ, ఇలా ఐదు సినీ సునామీలతో పాన్ ఇండియా కింగ్ గా ఇమేజ్ వచ్చింది. అది తన తప్పుకాదు.. తను వద్దనుకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ పోనే పోదు..
ఆయితే ఈప్రాసెస్ లోనే తనకి తెలియకుండానే మరో హీరో సినిమాను, రికార్డుని డ్యామేజ్ చేశాడు రెబల్ స్టార్. అదే షారుఖ్ మూవీ డంకీ… ఈ సినిమా కంటే ముందు బాలీవుడ్ బాద్ షా పటాన్, జవాన్ తో వరుసగా హిట్లు సొంతం చేసుకోవటమే కాదు, వరుసగా వెయ్యికోట్ల వసూళ్లని రెండు సార్లు సొంతం చేసుకున్నాడు
కట్ చేస్తే డంకీ మూవీతో హ్యాట్రిక్ వస్తుందనుకున్నారు. ఇది కూడా ఈజీగా వెయ్యికోట్ల వసూళ్లను రాబడుతుందన్నారు. కానీ సీన్ లోకి సలార్ వచ్చి750 కోట్ల వసూళ్లు రాబట్టింది. డంకీని పక్కకు నెట్టి, పాన్ ఇండియా మొత్తం సలార్ సునామీతోనే నిండిపోయింది.
ఇందులో ప్రభాస్ తప్పులేదు. అమాంతం పెరిగిన తన ఇమేజ్ కింద, ఖాన్లు కపూర్లు కూడా నలిగిపోతున్నారు. కాకపోతే, డంకీ మూవీ వసూళ్లకి ఆనకట్ట వేయటం కాదు, ఆ సినిమా ను సైడ్ చేసి సలారే పాన్ ఇండియాను డామినేట్ చేసింది. దీనికి రెబల్ స్టార్ ఇమేజే కారణం కావొచ్చు.. కాకపోతే డంకీ రిలీజ్ డేట్ ని ఎప్పుడో షారుఖ్ ఖాన్ అండ్ టీం ఎనౌైన్స్ చేసింది. కాని సలార్ ని మాత్రం సడన్ గా రిలీజ్ చేసి ప్రశాంత్ నీల్ రిస్కీ నిర్ణయం తీసుకున్నాడు. సో దర్శక నిర్మాతల లెవల్లో తీసుకున్న నిర్ణయం వల్ల, సలార్ సునామీలో షారుఖ్ డంకీ కొట్టుకుపోయింది.
అందుకు తీరిగ్గా ఇప్పుడు ప్రశాంత్ నీల్ షారుఖ్ ఖాన్ కి సారీ చెప్పాడు. అది కూడా హ్యాట్రిక్ హిట్లకి, మూడోసారి 1000 కోట్ల వసూళ్లకి సలార్ తో అడ్డు కట్టవేసి…తమ హీరో వల్ల షారుఖ్ కి వెయ్యికోట్ల వసూళ్లు రాకుండా అయిపోయిందంటూ, అందుకు సారి అనేశాడు ప్రశాంత్ నీల్. ఇది కూడా ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.. సీన్ లోకి ప్రభాస్ వస్తే ఎలా ఉంటుందో, ఈ స్టేట్ మెంట్ తో తెలుస్తోంది.