SALAAR: సలార్‌లో దేవా పాత్రతో తెరపై విధ్వంసమే..

దేవా క్యారెక్టరైజేషన్‌పై నీల్ ఇంట్రెస్టింగ్ లైన్ చెప్పాడు. ప్రభాస్ ముఖంలో ఒక అమాయకత్వం ఉంటుంది అని, అది తనలోని ఒక పసి కోణాన్ని చూపిస్తుందని, అలాగే ఒక సింహాన్ని కూడా చూపిస్తుందని ప్రశాంత్ నీల్ అన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2023 | 04:47 PMLast Updated on: Dec 20, 2023 | 4:47 PM

Prabhas Character In Salaar Movie With High Voltage Action

SALAAR: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ మరి కొన్ని గంటల్లో ఆడియన్స్‌ని పలకరించబోతుంది. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. విడుదలైన యాక్షన్ ట్రైలర్ ఆడియన్స్‌లో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సాలిడ్ డ్రామా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ చేసిన పాత్ర దేవాని ఎంత పవర్ ఫుల్‌గా చూపిస్తాడో అనేది రెండు ట్రైలర్స్‌లో, ఓ రేంజ్‌లో చూపించాడు.

Ravi Teja, Eagle, Trailer : రవితేజ ‘ఈగల్’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

అయితే అసలు దేవా క్యారెక్టరైజేషన్‌పై నీల్ ఇంట్రెస్టింగ్ లైన్ చెప్పాడు. ప్రభాస్ ముఖంలో ఒక అమాయకత్వం ఉంటుంది అని, అది తనలోని ఒక పసి కోణాన్ని చూపిస్తుందని, అలాగే ఒక సింహాన్ని కూడా చూపిస్తుందని ప్రశాంత్ నీల్ అన్నాడు. ఇదే కోవలో సలార్‌లోని తాను డిజైన చేసిన దేవా కూడా “అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు.. లేదంటే తల కూడా నరుకుతాడు” అని సింగిల్ లైన్‌లో అసలు ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుంది అనేది చెప్పాడు. అంటే ఇక ఈ పాత్రలో ప్రభాస్ చేసే విధ్వంసం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక 20 సెలెక్టెడ్ థియేటర్లలో తెల్లవారుజామున ఒంటిగంటకే షో కూడా వేయనున్నారు.

ఇక టికెట్ రేట్లు విషయానికి వస్తే.. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.250, రూ.175, రూ.100 రేట్లు ఉండగా, మల్టీఫెక్స్‌ల్లో రూ.370, రూ.470 ధరతో టికెట్స్ అమ్మాలని నిర్ణయించారు. అంటే సాధారణ టికెట్ రేట్లతో పోలిస్తే మల్టీఫెక్స్‌ల్లో రూ.100, సాధారణ థియేటర్లలో రూ.55 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.