ప్రభాస్ ఫౌజీ అడుక్కి వార ముందు… ఎన్టీఆర్, మహేశ్ సెన్సేషన్…

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 6, 2024 | 10:43 PMLast Updated on: Aug 06, 2024 | 10:43 PM

Prabhas Craze In Indian Cinema

ప్రభాస్ పేరు వినిపించకుండా, ప్రభాస్ సినిమా లేకుండా, ఎంటర్ టైన్ మెంట్ న్యూసే కాదు, ఫిల్మ్ మార్కెట్టే రన్ అయ్యేలా లేదు. నిజంగా కల్కీ క్రియేట్ చేసిన సునామీ తర్వాత రాజా సాబ్ ఏప్రిల్ లో వస్తాడంటే ఈపాటికే బాలీవుడ్ బ్యాచ్ గుండెల్లో పిడుగు పడినట్టౌతోంది. అలాంటిది, ఈనెల 17న ఫౌజీ లాంచ్ కాబోతోందంటే, బీటౌన్ మీద గన్ గురిపెట్టినట్టే..

ఆగస్ట్ నెలలో మూడు వింతలు జరగబోతున్నాయి.. ఒకటి మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా, రెండు సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త ప్రాజెక్టు, మూడు రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ ఈ మూడు సెన్సేషనల్ ప్రాజెక్టులు రెండు వారాల గ్యాప్ లో మొదలు కాబోతున్నాయి.

సలార్ తర్వాత సలార్ 2 ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఆ సీక్వెల్ మొదలుపెట్టేలోపే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఆగస్ట్ 9న సినిమా లాంచ్ చేయబోతున్నాడు. ఆల్రెడీ అంతా సిద్దమైంది. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ లో మొదలు కాబోతోంది. ఇక ఈనెల 9న మహేశ్ బర్త్ డే అవటంతో, ఆరోజే రాజమౌలి మేకింగ్ లో సినిమా మొదలు పెడతాడనే అంచనాలున్నాయి. ఏదో మహేశ్ లుక్ తాలూకు వీడియో వదిలబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మహేశ్ బర్త్ డే రోజు తన పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం

ఇక బాక్సాఫీస్ డైనోసార్ రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడీ ప్లాన్ చేసిన ఫౌజీ మూవీ ఈనెల 17న లాంచ్ కాబోతోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడాజరుగుతున్నాయి. ఆరోజు స్పెషల్ ప్రెస్ మీట్ ఉండబోతోందట. నేషనల్ మీడియాకు ముందే ఆహ్వానాలు పోవటంతో, ఈవిషయం ఇక అఫీషియలే అనుకోవాల్సి వస్తోంది. ఏదేమైనా ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోనేలా కేవలం రెండు వారాల గ్యాప్ లో మూడు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కబోతున్నాయి.