PRABHAS: కల్కి, రాజాసాబ్.. ఇద్దరూ డాన్స్ చేయాల్సిందే..

కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీలో మాస్ సాంగ్ ఉండే అవకాశం లేదు. కాని రెబల్ స్టార్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ కోసం సూపర్ మాస్ సాంగ్‌ని ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్. ఆ పాటకోసమే రూ.4 కోట్లు పెట్టి సెట్ వేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 06:25 PMLast Updated on: Feb 21, 2024 | 6:25 PM

Prabhas Doing Mass Songs And Dance In Upcoming The Raja Saab And Kalki 2898 Ad

PRABHAS: రెబల్ స్టార్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అది కూడా ఓ మాస్ సాంగ్ కోసం. ఆల్రెడీ సెట్ కూడా రెడీ చేస్తున్నారు. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీలో మాస్ సాంగ్ ఉండే అవకాశం లేదు. కాని రెబల్ స్టార్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ కోసం సూపర్ మాస్ సాంగ్‌ని ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్. ఆ పాటకోసమే రూ.4 కోట్లు పెట్టి సెట్ వేస్తున్నారు. అది కూడా షూట్ చేస్తే ఇక కల్కి షూటింగ్ మొత్తం పూర్తైనట్టేనట.

Nikhil Siddhartha: మెమొరబుల్ మూమెంట్.. తండ్రైన హీరో నిఖిల్.. కొడుకుకి తొలిముద్దు..!

ఆల్రెడీ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. హీరో అండ్ కో పాత్రలు కాకుండా మిగతా పాత్రల నటులు వాళ్ల వాళ్ల పాత్రలకు డబ్బింగ్ చెబుతున్నారు. ఐతే ఇది ఎంత సై-ఫై మూవీ అయినా, ఇందులో మాస్ కోసం ఓ సాలిడ్ సాంగ్‌ని ప్లాన్ చేశారట. బిల్లా నుంచి మిర్చి వరకు ప్రభాస్ మూవీలో మాస్ నెంబర్లకు ఉండే స్పెషాలిటీనే వేరు. ఆ క్రేజ్‌కి తగ్గ పాటని కల్కిలో పెట్టడం నిజంగా విచిత్రమైన నిర్ణయమే అయినా కమర్శియల్ యాంగిల్‌లో దానికో లెక్కుంది. ఇది తెలిసి డైరెక్టర్ మారుతి జాగ్రత్త పడుతున్నాడట. సై-ఫై మూవీ అయిన కల్కిలోనే మాస్ సాంగ్ ఉంటే, మాస్ కామెడీ సినిమా అయిన ది రాజా సాబ్‌లో సాంగ్స్ ఇంకెలా ఉండాలి..?

అందుకే ఇందులో రెండు ఐటమ్ సాంగ్స్ ప్లాన్ చేయిస్తున్నాడు మారుతి. ఆ పాటల్ని ఏప్రిల్‌లో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మొత్తానికి బాహుబలి తర్వాత ప్రయోగాలకే పరిమితమైన ప్రభాస్, సలార్ రేంజ్‌లో మాస్ ఎటాక్‌కి కల్కి, ది రాజా సాబ్‌తో సిద్దమౌతున్నాడు. సలార్‌లో కూడా మాస్ సాంగ్స్ లేకపోవటం వల్ల ఆకలిగా ఉన్న ఫ్యాన్స్‌కి, ది రాజా సాబ్, కల్కి ఫిల్మ్ టీమ్‌లు మాస్ సాంగ్స్‌తో ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్నాయి.