హే ప్రభాస్ తో కొరటాల శివ … కల్కీ బూసాన్ లో గౌరవం..

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత ఆరేంజ్ లోరికార్డులు క్రియేట్ చేసిన మూవీ కల్కీ. ఆల్రెడీ థియేటర్స్ లో 1200 కోట్లు రాబట్టి, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ తాలూకు బిజినెస్ తో మరో 300 కొల్లగొట్టిన మూవీ కల్కీ... ఓటీటీలో వ్యూస్ పరంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5 లో ఉన్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2024 | 09:33 PMLast Updated on: Sep 26, 2024 | 9:33 PM

Prabhas Fan Base In South Korea

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత ఆరేంజ్ లోరికార్డులు క్రియేట్ చేసిన మూవీ కల్కీ. ఆల్రెడీ థియేటర్స్ లో 1200 కోట్లు రాబట్టి, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ తాలూకు బిజినెస్ తో మరో 300 కొల్లగొట్టిన మూవీ కల్కీ… ఓటీటీలో వ్యూస్ పరంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5 లో ఉన్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అలాంటి ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. మొన్నటి వరకు ప్రభాస్ కి జర్మనీ, రష్యా, జపాన్ లోనే ఫ్యాన్స్ ఉన్నారన్నారు.కాని ఇప్పుడు కొరియాలో కూడా రెబల్ స్టార్ కి ఫిదా అయ్యే జనాల సంఖ్య పెరిగిపోయేలా ఉంది..

రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పాన్ ఇండియా మార్కెట్ లో ఓ ఎమోషన్ గా మారిపోయింది. తను స్క్రీన్ మీద కనిపిస్తే విజిల్స్, బాక్సాఫీస్ లో వసూళ్ల వరదలు కామన్ అయ్యేంతగా దేశవ్యాప్తంగా తనకో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు కల్కీ కి కొత్త గౌరవ దక్కడంతో దక్షిణ కొరియాలో కూడా రెబల్ స్టార్ ప్రభాస్ కి ఫ్యాన్ బేస్ పెరిగేలా ఉంది.

దక్షిన కొరియాలోని బుసాన్ లో కల్కీ స్పెషల్ షో వేస్తున్నారు. ఈ సినిమా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ లో వసూళ్లతో అరాచకం చేసి, నెలలు గడుస్తుంటే, ఇప్పుడు కొత్తగా కల్కీకి సరికొత్త గౌరవం దక్కుతోంది

అదే దక్షిణ కొరియాలోని బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కల్కీ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించటం. ఆల్రెడీ ఆస్కార్ వేటలో రెండు కేటగిరీల్లో నామినేట్ అయ్యే అవకాశం ఉందన్న టైంలో, ఇలాంటి ప్రత్యేక గౌరవం దక్కడం, అది కూడా వరల్డ్ వైడ్గా గా ఫోకస్ అవుతున్న కొరియన్ ఇండస్ట్రీ నుంచి కల్కికి ఇలాంటి గౌరవం దక్కడం గొప్ప విషయమే

కల్కీ క్లైమాక్స్ గ్రాఫిక్స్, కల్కీ సెకండ్ హాఫ్ లోని కంటెంట్ కి వరల్డ్ వైడ్ గా జనం ఫిదా అయ్యారు. అందుకే
29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కల్కి 2898 AD స్పెషల్ షో‌కి ఎంపికైంది. ఓపెన్ కేటగిరిలో ఈ సినిమాను ఎంపిక చేసారని తెలుస్తోంది. అక్టోబర్ 2 నుంచి 11 వరకు జరిగే 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కల్కి 2898 ADని అక్కడి అతిపెద్ద ఓపెన్ థియేటర్‌లో ప్రదర్శించబోతున్నారు

లండన్ లో ఎలాగైతే 6 వేల మంది ఆడియన్స్ కూర్చుని చూసే అతి పెద్ద సినిమా థియేటర్ ఉందో, అలాంటి థియేటర్ దక్షిణ కొరియాలో ఉంది. అందులోనే ఇప్పుడు కల్కీ స్పెషల్ షో వేస్తున్నారనగానే, అలాంటి గౌరవం అందుకున్న తొలి భారతీయ సినిమాగా ఈ మూవీ హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. ఇక జపాన్, రష్యా, జర్మని లానే దక్షిణ కొరియాలో కూడా రెబల్ స్టార్ కి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది.