Prashant Neel : సలార్ 2, KGF 3 రెడీ

సలార్ 2 (Salaar 2) ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సమ్మర్‌లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందనే వార్తలు వస్తునే ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 9, 2024 | 11:00 AMLast Updated on: May 09, 2024 | 11:00 AM

Prabhas Fans Are Eagerly Waiting To See When Salaar 2 Will Go On The Sets

సలార్ 2 (Salaar 2) ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సమ్మర్‌లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందనే వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అప్డేట్ బయటికి రాలేదు. కానీ చిత్ర యూనిట్ మాత్రం మే నెల చివర్లో సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుందని చెబుతు వచ్చారు.

ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashant Neil) కూడా ఫైనల్ చేసేశాడు. రీసెంట్‌గా ఓ ఇంటరాక్షన్‌లో భాగంగా మాట్లాడుతూ.. సలార్ 2 షూటింగ్‌కు రెడీ అవుతున్నామని కన్ఫామ్ చేశాడు ప్రశాంత్ నీల్. అలాగే కెజియఫ్ 3 పై కూడా సూపర్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే కేజీఎఫ్ 3 (KGF3) స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. కాకపోతే ఇప్పుడు యష్‌కి ఉన్న కమిట్మెంట్స్, అలాగే ప్రొడ్యూసర్ విజయ్‌కి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా.. ఈ సినిమా చేయడానికి కాస్త సమయం పడుతుంది.. అని తెలిపాడు.

కానీ ఖచ్చితంగా కెజియఫ్ చాప్టర్ 3 ఉంటుందని చెప్పేశాడు. అయితే.. మళ్లీ సలార్ నుంచి కెజియఫ్‌లోకి రావడానికి తాను కొంచెం బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నాను.. అని అన్నాడు. అందుకే ముందు సలార్ 2 పూర్తి చేసి.. ఆ తరువాత కేజీయఫ్ 3 చేస్తానని తెలిపాడు. దీనితో నీల్ కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే.. సలార్ 2 తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది ప్రశాంత్ నీల్. వచ్చే అక్టోబర్‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. కాబట్టి.. ఆ తర్వాతే కెజియఫ్ 3 ఉంటుందని చెప్పాలి. ఏదేమైనా.. సలార్ 2, ఎన్టీఆర్ 31, కెజియఫ్ చాప్టర్ 3 కోసం యావత్ సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.