Prabhas: వింత కోరికలు.. తట్టుకోలేకపోతున్న రెబల్ స్టార్
ప్రభాస్ యూఎస్ ట్రిప్ అయిపోయింది. కాని తనని వింత కోరికల సమస్య వెంటాడుతోంది. సలార్ పెండింగ్ షూటింగ్ తో బిజీ అవ్వాలి.. తర్వాత ప్రాజెక్ట్ కే పెండింగ్ షూటింగ్ తో పాటు పార్ట్ 2 తాలూకు కొన్ని సీన్లు పూర్తి చేయాలి.. ఇలాంటి టైంలో ప్రభాస్ కి ఊహించని సమస్య ఎదురైంది.

Prabhas' fans comments on social media to release the features of the upcoming film directed by Maruti starring Prabhas as the hero
మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా తాలూకు గ్లింప్స్ ఎప్పుడంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ కి విచిత్రమైన ప్రశ్న ఎదురౌంది. సలార్ టీజర్ ని వదిలారు. వెంటనే వారం గ్యాప్ లో ప్రాజెక్ట్ కే గ్లింప్స్ తో ఫ్యాన్స్ కి ప్రభాస్ కిక్ ఇచ్చాడు.
అయినా ఫ్యాన్స్ ఆకలి తీరినట్టు లేదు. రాజా డీలక్స్ అలియాస్ అంబాసిడర్ పేరుతో ఫోకస్ అయిన మారుతి మూవీ గ్లింప్స్ మీద ఎప్పుడు? ఎక్కడ? ఎలా అన్న ప్రశ్నలే వేస్తున్నారు ఫ్యాన్స్. ఈ గోల ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువైంది. 70శాతం పూర్తైన మారుతి సినిమా తాలూకు ఫస్ట్ లుక్ లేదా మేకింగ్ వీడియోనో రిలీజ్ చేయొచ్చుగా అని దర్శకుడికి కూడా స్వీట్ వార్నింగ్స్ వెళుతున్నాయి.