PRABHAS: ఒక్క పదంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌లో కంగారు పెరిగిందా..?
ఇక మీదట ఎవరూ డార్లింగ్ అన్న పదం వాడకూడదా..? సడన్‌గా ఈ పదం బ్యాన్ చేయాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది..? ఇవే డౌట్లు సోషల్ మీడియాలో పెరిగాయి. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి కొత్త కొత్త అనుమానాలు పెరగటానికి కారణమయ్యాయి.
PRABHAS: ప్రభాస్‌ని మొన్నటి వరకు యంగ్ రెబల్ స్టార్ అని పిలిచేవాళ్లు. ఇప్పుడు రెబల్ స్టార్‌గా ప్రమోషన్ దక్కింది. కాని అప్పుడూ.. ఇప్పుడు.. ఎప్పుడు.. ప్రభాస్‌ను ఇష్టపడేవాళ్లు తనని పిలిచేపేరు డార్లింగ్. అలాంటి పేరు బ్యాన్ కాబోతోందా..? ఇక మీదట ఎవరూ డార్లింగ్ అన్న పదం వాడకూడదా..? సడన్‌గా ఈ పదం బ్యాన్ చేయాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది..? ఇవే డౌట్లు సోషల్ మీడియాలో పెరిగాయి.
GAAMI VS BHIMA: గామి వర్సెస్ భీమా.. ఏది హిట్టు..?
ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి కొత్త కొత్త అనుమానాలు పెరగటానికి కారణమయ్యాయి. అసలు సంగంతేంటంటే.. డార్లింగ్ అని ఎవరిని పిలిచినా జైల్లో వేసే పరిస్థితులొచ్చాయి. ఇక మీదట డార్లింగ్ అని పిలవటం నేరంగా మారింది. అంతా కోల్‌కతా హైకోర్ట్ ఇచ్చిన తీర్పు మహత్యమే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఓ మహిళా కానిస్టేబుల్‌ని డార్లింగ్ అని పిలిచాడట. దీంతో అతడిపై కేసు నమోదైంది. హైకోర్టు విచారాణలో.. పరాయి స్త్రీని ఇష్టం వచ్చినట్టు పిలిచే స్థాయికి ఇండియా దిగజారలేదని జడ్జ్ క్లాస్ పీకాడు.
సో.. డార్లింగ్ అంటూ సంబోదించటాన్ని నేరంగా పరిగణించిన కోర్టు అతడికి శిక్ష విధించింది. అయితే.. అంతమాత్రానికి ప్రభాస్‌ని డార్లింగ్ అని పిలవకూడదా అంటే, పిలవొచ్చు. కాని డార్లింగ్ అన్న పదం వాడేముందు కోల్‌కతా కోర్టు స్టేట్మెంట్ గుర్తొచ్చి, ఒకప్పటిలా ఆ పదం వాడకపోవచ్చనే కామెంట్స్ పెరిగాయి.