Salar : ప్రభాస్ ఫ్యాన్స్ కొత్త రింగ్ టోన్
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రభాస్ 'సలార్' సినిమా గురించే చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం 'సలార్'. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాలోని పాటలు తక్కువే అయినా, బీజీఎం ప్రధాన బలంగా పనిచేసింది. ఈ సినిమాకు ప్రధాన బలమైన బీజీఎంను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Prabhas fans new ringtone
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రభాస్ ‘సలార్’ సినిమా గురించే చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాలోని పాటలు తక్కువే అయినా, బీజీఎం ప్రధాన బలంగా పనిచేసింది. ఈ సినిమాకు ప్రధాన బలమైన బీజీఎంను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు వస్తున్న భారీ రెస్పాన్స్ పట్ల సలార్ టీమ్ కూడా ఆనందపడుతుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ తాజాగా ‘సౌండ్ ఆఫ్ సలార్’ పేరుతో వీడియోను విడుదల చేసింది. రవి బస్రూర్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ అద్భుతమైన సౌండ్ ట్రాక్‌కు ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ప్రభాస్ ఫ్యాన్స్ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేస్తు, థమన్ రింగ్ టోన్ గా కూడా సెట్ చేసుకుంటున్నారు. ఇక 2023లో విడుదలయిన అన్ని సినిమాల్లో మొదటిరోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా ‘యానిమల్’, ‘జవాన్’, ‘పఠాన్’ నిలిచాయి. ఇప్పుడు ఏకంగా ఆ మూడు సినిమాను దాటి ‘సలార్’ అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను సాధించింది. ఇప్పటికే ‘సలార్’ పాజిటిక్ టాక్‌తో దూసుకుపోతుందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డులు బ్రేక్ చేస్తున్నందుకు వారు డబుల్ సంతోషంలో మునిగిపోయారు. ‘డంకీ’ రిలీజ్ వల్ల తక్కువ స్క్రీన్స్ లభించినా ఈ రికార్డు సాధించడమంటే అది ఒక్క ప్రభాస్ వల్లే సాధ్యం అంటూ కలర్ ఎగరేస్తున్నారు.