Prabhas : శ్రీలీలకు ప్రభాస్ ఫ్యాన్స్ షాక్!

శ్రీలీల (Srileela).. ఈ పేరు వింటే చాలు అందరికీ ఆమె చేసే డ్యాన్స్ గుర్తొస్తుంది. కానీ శ్రీలీలకు మాత్రం డ్యాన్స్ తప్ప ఇప్పటి వరకు పవర్ ఫుల్ క్యారెక్టర్ ఒక్కటి కూడా పడలేదు. బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో ఓకె అనిపించుకున్నప్పటికీ.. శ్రీలీలకు సూపర్ క్యారెక్టర్ పడితే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2024 | 12:22 PMLast Updated on: Jan 29, 2024 | 12:22 PM

Prabhas Fans Shock Srilila

శ్రీలీల (Srileela).. ఈ పేరు వింటే చాలు అందరికీ ఆమె చేసే డ్యాన్స్ గుర్తొస్తుంది. కానీ శ్రీలీలకు మాత్రం డ్యాన్స్ తప్ప ఇప్పటి వరకు పవర్ ఫుల్ క్యారెక్టర్ ఒక్కటి కూడా పడలేదు. బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో ఓకె అనిపించుకున్నప్పటికీ.. శ్రీలీలకు సూపర్ క్యారెక్టర్ పడితే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ శ్రీలీల చేసిన సినిమాలన్నీ డ్యాన్స్‌ నెంబర్స్‌కే పరిమితమయ్యాయి. అంతేకాదు.. సరైన హిట్స్ కూడా ఇవ్వలేకపోయాయి. దీంతో ఇక పై శ్రీలీల సరైన కథలు ఎంపిక చేసుకోవాలని అంటున్నారు.

అమ్మడు కూడా కాస్త గ్యాప్ తీసుకొని మంచి పాత్రలు వస్తే తప్ప సినిమాలు చేయనని భావిస్తోందట. కానీ ప్రభాస్ లాంటి హీరోతో ఛాన్స్ వస్తే శ్రీలీల వదులుకునే ఛాన్స్ లేదు. అయితే.. డార్లింగ్ (Darling) ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సరసన శ్రీలీల వద్దని అంటున్నారు. గతంలో మారుతి సినిమాలో శ్రీలీలను తీసుకోవాలని కొంతమంది ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. నెక్స్ట్ ప్రభాస్ లైన్లో సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, హను రాఘవపుడి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. స్పిరిట్ సంగతి పక్కన పెడితే.. హను సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల పేరు చాలా రోజులుగా వినిపిస్తోంది.

కానీ శ్రీలీల ఫ్లాప్ ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత.. ప్రభాస్‌ సినిమాలో వద్దని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎవరైనా ప్రభాస్‌తో శ్రీలీల నటిస్తుందని పోస్ట్ చేస్తే చాలు.. వెంటనే వద్దని కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. హను రాఘవపూడి, ప్రభాస్ ఏమనుకుంటున్నారో చూడాలి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.