5000 కోట్ల కటౌట్ అంటే తమాషా… కోసి కారం పెడుతున్నరెబల్ ఫ్యాన్స్…
రెబల్ స్టార్ ప్రభాస్ ఖాన్లు, కపూర్లను దాటడం కాదు, వాళ్లు కూడా టచ్ చేయలేని రేంజ్ కి ఎదిగాడు. బాలీవుడ్ కింగ్ లు, బాద్ షాలు కూడా కుళ్లుకునే రేంజ్ లో పాన్ ఇండియా కింగైపోయాడు. అలాంటి తనకి ఊహించని అవమానం పరోక్షంగా జరిగింది.
రెబల్ స్టార్ ప్రభాస్ ఖాన్లు, కపూర్లను దాటడం కాదు, వాళ్లు కూడా టచ్ చేయలేని రేంజ్ కి ఎదిగాడు. బాలీవుడ్ కింగ్ లు, బాద్ షాలు కూడా కుళ్లుకునే రేంజ్ లో పాన్ ఇండియా కింగైపోయాడు. అలాంటి తనకి ఊహించని అవమానం పరోక్షంగా జరిగింది. అది కూడా వెయ్యికోట్ల హిట్ ఉందనే పొగరుతో ఓ దర్శకుడు చేసిన తప్పువల్ల…. రెబల్ ఫ్యాన్స్ రక్తం మరిగేలా ఓ బాలీవుడ్ దర్శకుడు, ఓ దిక్కుమాలిన ఆఫర్ ని ప్రభాస్ ముందు పెట్టాడట. అవకాశం ఎప్పుడూ గొప్పదే… కాని అవకాశం పేరుతో అవమానం చేస్తే, కర్మ వెంటాడుతుంది. ఇలానే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆమధ్య ప్రభాస్ మీద సింగిల్ కామెంట్ చేస్తే, ఇప్పుడు తన ప్రొడక్షన్ హౌజ్ సగానికి సగం అమ్ముకోవాల్సిన దుస్తితొచ్చింది. ఇప్పుడు మరో దర్శకుడికి కూడా ఇలాంటి కర్మే కాలేలా ఉంది. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ ఇలా సౌత్ లోతెలుగు హీరోలు, బాలీవుడ్ మార్కెట్ ని కబ్జా చేసినా, ఇంకా ఖాన్లూ, కపూర్లే బీటౌన్ కింగులనుకుంటున్నట్టున్నారు. రియాలిటీని అర్ధం చేసుకోకుండా ప్రభాస్ విషయంలో ఎవరు తప్పు చేశారు? ఆఫర్ పేరుతో అవమానించే సాహసం ఎందుకు చేశారు?
రెబల్ స్టార్ ప్రభాస్ కేవలం పాన్ ఇండియా కింగ్ కాదు, తను పాన్ ఆసీయా చక్రవర్తి… అంతకుమించి చెప్పాలంటే తన కటౌట్ కి తగ్గట్టు చెప్పాలంటే బాక్సాఫీస్ డైనోసార్… ఆకటౌట్ వెండితెరమీద కనిపిస్తే చాలు బాక్సాఫీస్ లోకనకవర్షమే… ఇక కథ యావరేజ్ గా ఉంటేనే వందలకోట్ల వసూళ్లొస్తాయి.. ఇక ఏమాత్రం కథ బాగున్నా, 1000 కోట్ల చాలా చిన్న టార్గెట్ ఆరేంజ్ లోతెలుగు,తమిల్, మలయాళం, కన్నడతో పాటు హిందీ మార్కెట్ లో కూడా జెండా పాతాడు ప్రభాస్… అలాంటి కటౌట్ ని తక్కువ అంచనా వేసినా, తక్కువ చూసే ప్రయత్న చేసినా అంతకు మించి అవమానం లేదు
అదే ఇప్పుడు జరిగింది… బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో పటాన్ మూవీ తీసిన సిద్ధార్థ్ అనంద్. ఇప్పుడు అదే షారుఖ్ తో మరో సినిమా ప్లాన్ చేశాడు. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ ని సెకండ్ హీరోగా, అడిగారట. అది కూడా గెస్ట్ రోలైతే, సరే సల్మాన్ ఎంట్రి ఇచ్చినట్టు, కాసేపే కనిపించి ఖాన్ కి హెల్ప్ చేసేందుకు ప్రభాస్ కూడా సిద్దపడేవాడు..
అలాకాకుండా, ప్రభాస్ ని సెకండ్ హీరోగా తీసుకునే ప్రయత్నం చేశాడట సిద్ధార్థ్ ఆనంద్.. ఇదే టూమచ్ కామెడీగా మారింది. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలంటే షారుఖ్, సల్మాన్, ఆమిర్, అక్షయ్, హ్రితిక్ …కాని వాళ్లందిని కలిపినాఇప్పుడు నార్త్ ఇండియాలో ప్రభాస్ ఇమేజ్ తో పోలికే లేదు. ఆరేంజ్ లో నార్త్ ఇండియాలో ప్రతీ ఇంట్లో వ్యక్తిగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది
కాబట్టే, షారుఖ్ మూవీలో ప్రభాస్ ని సైడ్ హీరోగా తీసుకోవాలనుకున్న సిద్దార్ధ్ ఆనంద్ ప్రయత్నం రివర్స్ ఫైర్ అయ్యింది. ఇంకా ఏకాలంలో ఉన్నారు. ఇంకా బాలీవుడ్ అండే ఖాన్లు, కపూర్ల జమానా అనుకున్నాంటున్నారా? ఆ అభిప్రాయమే పాన్ ఇండియా మూవీల పుణ్యమాని పోయింది. ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా కింగ్ అయ్యాడు. షారుఖ్ కూడా పటాన్, జవాన్ తో రెండు సార్లు 1000 కోట్ల వసూల్లు రాబట్టి ఉండొచ్చు. నటనలో గొప్ప పెర్ఫార్మరే కావొచ్చు.. కాని తనకి, ప్రభాస్ కి ఉన్న తేడా.. కమల్ కి, రజినీకాంత్ కి ఉన్నతేడాలాంటిదే.. కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడైనా కావొచ్చు..
కాని రజినీకాంత్ కి మాస్ లో ఉన్న ఇమేజ్, క్రేజ్ కమల్ కి లేదు.. అందుకే తన సినిమా రిలీజైతే, పోటీకొచ్చే మూవీలన్నీ కొట్టుకుపోవాలి… అలాంటి రజినీకాంత్ సినిమాలనే కొట్టుకుపోయేలా చేసే రేంజ్ ఇమేజ్ ప్రభాస్ కి సొంతమైంది… ఆ విషయం ఐదు సార్లు ప్రూవ్ అయ్యింది. బాహుబలి, బాహుబలి 2, సాహో, సలార్ , కల్కీ తో వచ్చిన వసూళ్లని కలిపితే 5 వేల కోట్లు. అలాంటి ప్రభాస్ మూవీలతో పోలిస్తే, షారుఖ్ ఖాన్ 2 వేల కోట్లు ఏమూలకి
అలా పోల్చి షారుఖ్ ని తగ్గించాలని కాదు.. తనేం చిన్న నటుడు కాదు.. కాని ప్రభాస్ రేంజ్ వేరు.. అలాంటి హీరోని గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన రిక్వెస్ట్ చేసినా పర్లేదు. కాని, సైడ్ రోల్ ఇచ్చి ఏదో తనని ఉద్దరిస్తున్నట్టు ఓవరాక్షన్ చేయటం కాస్త అతి… అదే ప్రభాస్ కి నచ్చలేదో, ఏమో కాని ఆ మల్టీ స్టారర్ కి నో చెప్పాడు రెబల్ స్టార్. లేదంటే కన్నప్ప లాంటి మూవీలో గెస్ట్ రోల్ వేసిన ప్రభాస్, షారుఖ్ మూవీలో గెస్ట్ రోల్ వేయకుండా ఉంటాడా? ఇదే అందరికి వచ్చే కామన్ డౌట్.