డార్లింగ్ కూలే.. ఫ్యాన్సే రెబల్.. గెలికారు కాబట్టే.. అనుభవించాల్సిందే..

రెబల్ స్టార్ వివాదాలకు దూరం.. డార్లింగ్ బేసిగ్గా కూల్.. అలాని తన జోలికొస్తే, తన ఫ్యాన్స్ మాత్రం కూల్ గా లైట్ తీసుకోరని మరోసారి ప్రూవ్ అయ్యింది. అవార్డు ఫంక్షన్ లో రానా, తేజ సజ్జా కామెంట్లు కామెడీ కంటే కాంట్రవర్సీకే కారణమయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 8, 2024 | 05:25 PMLast Updated on: Nov 08, 2024 | 5:25 PM

Prabhas Fans Target Rana

రెబల్ స్టార్ వివాదాలకు దూరం.. డార్లింగ్ బేసిగ్గా కూల్.. అలాని తన జోలికొస్తే, తన ఫ్యాన్స్ మాత్రం కూల్ గా లైట్ తీసుకోరని మరోసారి ప్రూవ్ అయ్యింది. అవార్డు ఫంక్షన్ లో రానా, తేజ సజ్జా కామెంట్లు కామెడీ కంటే కాంట్రవర్సీకే కారణమయ్యాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో రానా, తేజ సజ్జా మీద ట్రోలింగ్స్, కామెంట్ల కౌంటర్స్ పెరిగాయి. ఇప్పుడా ఎటాక్ పీక్స్ కి చేరేలా ఉంది. రానా ఎంతగా ప్రభాస్ కి ఫ్రెండే అయినా, బాహుబలి విషయంలో కలిసే ఇద్దరు జర్నీ చేసినా, ఫ్యాన్స్ మాత్రం తన కామెంట్స్ ని తీసుకోలేకపోయారు. ఆదిపురుష్ మీద వేసిన సెటైర్, మిస్ ఫైర్ అవటంతో రెండు రోజులు గా మండిపడుతున్న ఫ్యాన్స్, ఇప్పుడు వివాదాన్ని పీక్స్ కి తీసుకెళ్లారు.. ఇంతకి ఏం జరిగింది? ఈ కాంట్రవర్సీకి గేట్లు పడేదెప్పుడు..?

రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు బేసిగ్గా ప్రభాస్ మూవీలొస్తేనే మొదలవ్వాలి…కాని ఈసారి సినిమా వల్ల కాకుండా, రానా కామెంట్ వల్ల పూనకాలు కాదు, కోపాలతో కామెంట్ల ఎన్ కౌంటర్లు జరిగాయి.. నిన్నటి వరకు సర్లే రానా, తేజా సజ్జ కామెంట్లు కొంతవరకు ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించాయనుకున్నారు

కట్ చేస్తే సోషల్ మీడియాలో ఆ వివాదం సునామీలా మారుతోంది. సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్ ఇంత యాక్టివ్ గా ఫైట్ చేసే పరిస్థితి అప్పుడెప్పుడో సాహో టైంలో జరిగింది. తర్వాత కల్కీలో ప్రభాస్ పాత్ర మీద హిందీ నటుడు చేసిన వెకిలి కామెంట్స్ టౌంలో ఫ్యాన్స్ ఫైర్ అయ్యే పరిస్థితి వచ్చింది

కట్ చేస్తే ఇప్పుడు తెలుగు హీరో, అది కూడా ప్రభాస్ ఫ్రెండ్ అయిన రానా వల్లే రెబల్ ఫ్యాన్స్ మండిపడే పరిస్థితొచ్చింది. ఆదిపురుష్ మూవీ రిజల్ట్ మీద రానా వేసిన సెటైర్, హనుమాన్ సినిమాను ప్రమోట్ చేస్తున్నట్టు ఉన్న కామెంట్, రెబల్ ఫ్యాన్స్ జీర్నించుకోలేకపోతున్నారు

నిజానికి ఆదిపురుష్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అప్పియరెన్స్ కే జనం ఫిదా అయ్యారు. తన పెర్ఫామెన్స్ కి వంకపెట్టలేం.. కాని మేకింగ్ విషయంలో, గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు ప్రభాస్ ని నమ్మించి మోసం చేశాడు. కాని ప్రభాస్ మాత్రం నిర్మాతని మునగకుండా కాపాడాడు.. తన క్రేజ్, ఇమేజ్ తో 650 కోట్ల సినిమాను 710 కోట్ల మూవీగా మార్చాడు. పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చిందంటే.. అది రెబల్ స్టార్ క్రేజ్.

విచిత్రం ఏంటంటే దర్శక నిర్మాతలు చేసిన తప్పుకి ప్రభాస్ బలవటం కాదు, తనే దర్శక నిర్మాతల్ని గట్టెక్కించాడు. అలాంటి ఊహాతీతమైన క్రేజ్, మార్కెట్ ఉన్న హీరో మీద, తన సినిమా మీద లూజ్ టాక్ చేయటం అంటే, అది రెబల్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. తేజ సజ్జ కంటే రానానే ఎక్కువగా టంగ్ స్లిప్ అవటంతో, తన మీదే సోషల్ మీడియాలో వార్ రోజు రోజుకి పీక్స్ కి వెళుతోంది.