దీనెక్క… ప్రభాస్ ఫౌజీ ఓటీటీ రేట్ ఇది, ఆల్రెడీ కోనేసారు…!

ఇప్పుడు ప్రభాస్ టాలీవుడ్ హీరో కాదు... ఇండియన్ సినిమా రెబల్ స్టార్. ప్రభాస్ తో సినిమా అంటే వెయ్యి కోట్ల బొమ్మ అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. ఒక్కో సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ బెండ్ తీస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2024 | 05:55 PMLast Updated on: Oct 26, 2024 | 5:55 PM

Prabhas Faujis Ott Rate Is This Already Done

ఇప్పుడు ప్రభాస్ టాలీవుడ్ హీరో కాదు… ఇండియన్ సినిమా రెబల్ స్టార్. ప్రభాస్ తో సినిమా అంటే వెయ్యి కోట్ల బొమ్మ అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. ఒక్కో సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ బెండ్ తీస్తున్నాడు. రిజల్ట్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాకు వసూళ్లు రావడం చూసి… ఏళ్ళ తరబడి సినిమా పరిశ్రమలో పాతుకుపోయిన వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ టాక్స్ వచ్చినా వందల కోట్లు వసూళ్లు చేసాయి. నిర్మాతలకు ఆ సినిమాలు కాసుల పంట పండించాయి.

కల్కీ, సలార్ సినిమాలు అయితే ప్రభాస్ రేంజ్ ను ఎక్కడికో తీసుకు వెళ్ళాయి. వెయ్యి కోట్లు ప్రభాస్ కు ఇప్పుడు ఈజీ టాస్క్. బాలీవుడ్ లో రెండు మూడు హిట్ సినిమాల వసూళ్లు అవి. బాలీవుడ్ ఎంత పగబట్టి ప్రభాస్ ను టార్గెట్ చేసినా ప్రభాస్ రేంజ్ పెరిగిందే గాని తగ్గడం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలు ప్రభాస్ లైన్ లో పెట్టాడు. మారుతీ డైరెక్షన్ లో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాల తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాను ప్లాన్ చేసాడు. ఈ సినిమా షూట్ కూడా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత సలార్ 2 సినిమాలో నటిస్తాడు. వీటి తర్వాత మరో రెండు సినిమాలను అప్పుడే లైన్ లో పెట్టేసాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ సినిమా రైట్స్ కొనాలంటే ఓటీటీ సంస్థలకు చుక్కలు కనపడుతున్నాయి. హిట్ టాక్ వస్తే మాత్రం సినిమాకు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాను కొంటున్నారు. అందుకే ఇప్పుడు ఒక ఓటీటీ సంస్థ జాగ్రత్త పడుతోంది.

సినిమా హిట్ టాక్ వస్తే… వందల కోట్లు ఖర్చు పెట్టడం వద్దు అని… సినిమా రిలీజ్ కు ముందే ఓటీటీ రైట్స్ ను భారీగా ఖర్చు చేసి కొనేసింది. 150 కోట్ల చౌక బేరంతో ఫౌజీ హక్కులను కొనేసినట్టు టాక్. విడుదల వరకు వెయిట్ చేసి తర్వాత లాస్ అవ్వడం కంటే ఇప్పుడే కొనడం మంచిది అని సంస్థ యాజమాన్యం భావించింది. అయితే కథ విషయంలో సంస్థకు ఒక అవగాహన ఉందని అందుకే ఇంత ఖర్చు చేసారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.