Yesh: ప్రభాస్ కోసం సీన్లోకొచ్చిన రాఖీ భాయ్… ట్విస్ట్ మీద ట్విస్ట్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో కేజీయఫ్ ఫేం యష్ గెస్ట్ రోల్ వేస్తాడని ఎప్పటి నుంచో అంటున్నారు. ఐతే అదిప్పుడు నిజం కాబోతోంది. కొత్త షెడ్యూల్ లో యష్ గెస్ట్ రోల్ సీన్స్ ని తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఐతే ఈ ఏడాది ఇలాంటి విచిత్రాలు ప్రభాస్ మూవీలోనే కాదు, మహేశ్, ఎన్టీఆర్ సినిమాల్లో కూడా కనిపించబోతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 27, 2023 | 05:00 PMLast Updated on: Jun 27, 2023 | 5:00 PM

Prabhas Film Salaar Is Directed By Prashant Neel And It Is Reported That Kgf Hero Yash Is Playing A Guest Role In The Film

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీయనున్న మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ వేయబోతున్నాడు. అంతా జక్కన్న మీద గౌరవం వల్లే అతిధి పాత్ర వేయబోతున్నాడట. అంతేకాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం దేవరలో గెస్ట్ రోల్ వేసేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్దమయ్యాడు.

ప్రీ క్లైమాక్స్ ఫైట్ లోరామ్ చరణ్ స్పెషల్ అప్పియరెన్స్ కోసం కొరటాల సీన్లు రిపేర్లు చేయటం మీదే ఇండస్ట్రీలో చర్చ పెరిగింది. ఇక ప్రభాస్ మరో సినిమా స్పిరిట్ లో కూడా ఓ హీరో గెస్ట్ గా రావటం మీద గుసగుసలు పెరిగాయి. తనే అల్లు అర్జున్ అంటున్నారు. అల్లు అర్జున్ కి బేసిగ్గా ఫ్యాన్ అయినా సందీప్ రెడ్డి వంగ, స్పిరిట్ లో బన్నీ స్పెషల్ అప్పియరెన్స్ కి ప్లాన్ చేశాడని ఫిల్మ్ నగర్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.