Prabhas: సలార్ ప్రమోషన్ విషయంలో చేతులెత్తేసిన ప్రభాస్..!

ప్రశాంత్ నీల్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడట ప్రభాస్. సలార్‌ని ఎప్పుడు, ఎలా రిలీజ్ చేయాలి, ప్రమోషన్ ఎలా ఉండాలనే విషయంలో డైరెక్టర్‌తో పాటు నిర్మాతకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడట ప్రభాస్. అందుకే సలార్ ప్రమోషన్‌ని పూర్తిగా వాళ్లకే అప్పజెప్పి కల్కి 2898 షూటింగ్‌కే టైం కేటాయిస్తున్నాడని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 18, 2023 | 06:00 PMLast Updated on: Aug 18, 2023 | 6:00 PM

Prabhas Gave Full Freedom To Director Prashanth Neel

Prabhas: ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ తీసిన మూవీ సలార్. ఇది రెండు భాగాలుగా తెరకెక్కించాలనే, ముందుగా మొదటి భాగం రిలీజ్‌కి రెడీ చేశారు. విడుదలకి నెలన్నర కూడా టైం లేదు. కాని ఇంతవరకు ప్రమోషన్ ఏదీ పెద్దగా మొదలైనట్టులేదు. అదే ఫ్యాన్స్‌ని, సినీ జనాన్ని భయపెడుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడట ప్రభాస్.

సలార్‌ని ఎప్పుడు, ఎలా రిలీజ్ చేయాలి, ప్రమోషన్ ఎలా ఉండాలనే విషయంలో డైరెక్టర్‌తో పాటు నిర్మాతకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడట ప్రభాస్. అందుకే సలార్ ప్రమోషన్‌ని పూర్తిగా వాళ్లకే అప్పజెప్పి కల్కి 2898 షూటింగ్‌కే టైం కేటాయిస్తున్నాడని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ఈ పాన్ ఇండియా మూవీ ప్రమోషన్‌ని కేవలం టీజర్ వరకే పరిమితం చేశాడు. ట్రైలర్‌ని సెప్టెంబర్ సెకండ్ వీక్ చివర్లో రిలీజ్ చేస్తారట. అంటే సెప్టెంబర్ 15కి ట్రైలర్ వస్తే, ఇక సినిమా రిలీజ్‌కి రెండు వారాల టైం కూడా ఉండదు.

మరి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బెల్టులో ఎప్పుడు ప్రమోషన్ పెంచుతారు..? ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ అంటున్నారంటే, యూఎస్, యూరప్‌లో ప్రమోషన్ కి టైం ఎప్పుడు కేటాయిస్తారనే ప్రశ్నలకు ఆన్సరే లేదు. కేజీయఫ్ 1, 2 టైంలో ఆ సినిమా ప్రమోషన్స్ ఎలా ఉండలనేది రాజమౌళినే గైడ్ చేశాడు. మరి ఇప్పుడు కూడా ప్రశాంత్ నీల్.. జక్కన్న సాయం తీసుకుంటాడా అంటే, అలాంటి సీనేం కనిపించట్లేదు.