ప్రభాస్ హెయిర్ స్టైల్, హాస్టల్ లో స్టూడెంట్స్ ధర్నా
ఇండియా వైడ్ గా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ పీక్స్ లో ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇండియా వైడ్ గా పెరిగినా కల్కీ సినిమా తర్వాత మాత్రం అది డబుల్ అయింది. ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే చాలు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఇండియా వైడ్ గా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ పీక్స్ లో ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇండియా వైడ్ గా పెరిగినా కల్కీ సినిమా తర్వాత మాత్రం అది డబుల్ అయింది. ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే చాలు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు. ఆదిపురుష్ తర్వాత స్టోరీ సెలెక్షన్ విషయంలో పక్కా లెక్కలతో ఉంటున్న ప్రభాస్ ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. నేషనల్ లెవెల్ లో నిర్మాణ సంస్థలు ప్రభాస్ కోసం పోటీ పడుతున్నాయి.
కర్ణాటకలో స్టార్ హీరోలతో సినిమాలు చేసే హోంబలే సంస్థ ఇప్పుడు ప్రభాస్ కు భారీగా అడ్వాన్స్ ఇచ్చి సినిమాలు చేస్తోంది. మూడు సినిమాలను ఆ సంస్థ లైన్ లో పెట్టింది. బాలీవుడ్ ను ప్రభాస్ లైట్ తీసుకుని… టోటల్ హిందీ ఇండస్ట్రీకి ఇప్పుడు మొగుడు అయ్యాడు. వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ అక్కడి హీరోలకు అసలు గ్యాప్ ఇవ్వడం లేదు. ఇక తమిళ మార్కెట్ పై కూడా ప్రభాస్ సీరియస్ ఫోకస్ చేసాడు అనే చెప్పాలి. తమిళంలో ప్రభాస్ సినిమాలకు డిమాండ్ పెరగడంతో అక్కడి నిర్మాతలు కూడా రెడీ అయ్యారు.
ఇటీవల లోకేష్ కనగరాజ్ తన డ్రీం ప్రాజెక్ట్… ఎల్సీయులో మల్టీ స్టారర్ కోసం ప్రభాస్ కు ఓ కథ చెప్పాడు. 2027 లో ఆ సినిమాను లోకేష్ రిలీజ్ చేసేలా ప్రభాస్ ను ఒప్పించాడు. ఆ సినిమాకు హోంబలే ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నట్టు టాక్. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ స్టార్ హీరో. ఇండియాలో ప్రభాస్ రేంజ్ ను బీట్ చేసే హీరో అయితే ప్రస్తుతం కనపడటం లేదు. మన తెలుగు హీరోలు కూడా ప్రభాస్ తో పోటీ పడటానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ఈ న్యూస్ చూస్తున్న ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
తాజాగా వరంగల్ లో ఓ హాస్టల్ లో స్టూడెంట్స్ ప్రభాస్ కు పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు. సాధారణంగా ఫుడ్ బాలేదు అని స్టడీ బాలేదు అని ఫిర్యాదు చేసే స్టూడెంట్స్ రీసెంట్ గా కంప్లైంట్ బాక్స్ లో వేసిన కంప్లైంట్స్ చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. ప్రభాస్ లా హెయిర్ స్టైల్ కావాలని కంప్లైంట్ బాక్స్ లో లెటర్ లు వేసారు. అలాగే అమ్మాయిలు చీర కట్టడుకోవడానికి పర్మీషన్ ఇవ్వాలని రిక్వస్ట్ చేసారు. ఇది చూసిన అధికారుల మైండ్ బ్లాక్ అయింది.