Naga-Chaitanya : ప్రభాస్ ‘బుజ్జి’ పై హ్యాండ్ చేసిన నాగచైతన్య

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా ఎప్పడెప్పుడు చూస్తామా అని ఆగలేకపోతున్నారు జనాలు. అంతలా సినిమా హైప్ పెంచేస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2024 | 03:21 PMLast Updated on: May 25, 2024 | 3:21 PM

Prabhas Hand On Buzzy Is Naga Chaitanya

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా ఎప్పడెప్పుడు చూస్తామా అని ఆగలేకపోతున్నారు జనాలు. అంతలా సినిమా హైప్ పెంచేస్తుంది. సినిమాలో ఒక్క ప్రభాస్ గురించే కాదు.. సినిమా కోసం వాడుతున్న వస్తువులు కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోతున్నాయి. ఆ మధ్య సినిమా కోసం ప్రత్యేక గన్ ని రూపొందించారు. తాజాగా బుజ్జి అనే కారుని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇటీవలే ఒక ఈవెంట్ ని కూడా నిర్వహించారు ఈ బుజ్జి కారు కోసం. ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టు బుజ్జిని చాలా వినూత్నంగా, చాలా డిఫరెంట్ గా తయారు చేశారు. ప్రభాస్ డ్రైవ్ చేసుకుంటూ బుజ్జిని ఈవెంట్ లో ఎంట్రీ ఇవ్వడం.. అది చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోవడం మనం చూశాం. ఆ బుజ్జి కారు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది నెటిజన్స్ దృష్టిని మాత్రమే కాకుండా సెలబ్రిటీల దృష్టిని సైతం ఆకర్షిస్తోంది.

తాజాగా మరో స్టార్ హీరో దీనిపై మనసు పారేసుకున్నాడు. ఆ బుజ్జితో ఎలాగైనా డ్రైవ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. తన ఆనందాన్ని ఆపుకోలేక వెంటనే వెళ్లి బుజ్జిని కలిసాడు. అయితే ఆ హీరో మరెవరో కాదు.. అక్కినేని నాగ చైతన్య. మాములుగానే నాగ చైతన్యకు కార్లంటే పిచ్చి. అందులోనూ స్పోర్ట్స్ కార్లంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. స్పోర్ట్స్ కార్లలో రేసింగ్ చేసే అనుభూతిని పొందుతూ ఉంటాడు. ఆ ఇష్టంతోనే అతడు హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ మోటార్ స్పోర్ట్ రేసింగ్ టీమ్‌కి ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. మరి ఇంత పిచ్చి ఉన్నప్పుడు ఆగుతాడా.. వెంటనే వెళ్లి ప్రభాస్ బుజ్జిని కలిసాడు. డ్రైవ్ చేసేంత వరకు వదలడు. మొత్తానికి బుజ్జిపై తన హ్యాండ్ వేసేశాడు. బుజ్జితో స్పీడ్ డ్రైవ్ చేస్తూ నాగ చైతన్య భలే థ్రిల్ అయ్యాడు. అయితే ఆ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఓ వీడియో రూపంలో తెలియజేయగా వైరల్ గా మారింది.

బుజ్జి వెహికల్ తయారీని చూసి ఆశ్చర్యపోయాడు చైతు. ఈ మేరకు తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని.. ఇంజనీరింగ్‌కు సంబంధించిన అన్ని రూల్స్‌ను మీరు బ్రేక్ చేశారని బుజ్జిని రూపొందించిన టీంపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.దీన్ని బట్టి చూస్తే ‘కల్కి 2898 AD’ను ప్రమోట్ చేయడానికి మరెందరో తెలుగు స్టార్లను రంగంలోకి దించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది