Salar : ప్రభాస్ కి నిర్మాతకీ గొడవ.. సలార్ కి నో ప్రమోషన్..

ఓ స్టార్ హీరో సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుందంటే ప్రమోషన్ పీక్స్ లో ఉండాలి. అప్డేట్స్ తో ఆడియన్స్ ఉక్కిరిబిక్కిరి అవ్వాలి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ తో మోత మోగిపోవాలి. కానీ ఈ విషయాన్ని లైట్ తీసుకుంది సలార్ టీం. రిలీజ్ కి కేవలం వన్ వీకే టైం ఉన్నా ఎలాంటి సందడి చేయడం లేదు. దీనికి కారణం ప్రభాస్ కి నిర్మాత కీ మధ్య వచ్చిన గొడవే అంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2023 | 01:06 PMLast Updated on: Dec 13, 2023 | 1:06 PM

Prabhas Has A Fight With The Producer No Promotions For Salar

ఓ స్టార్ హీరో సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుందంటే ప్రమోషన్ పీక్స్ లో ఉండాలి. అప్డేట్స్ తో ఆడియన్స్ ఉక్కిరిబిక్కిరి అవ్వాలి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ తో మోత మోగిపోవాలి. కానీ ఈ విషయాన్ని లైట్ తీసుకుంది సలార్ టీం. రిలీజ్ కి కేవలం వన్ వీకే టైం ఉన్నా ఎలాంటి సందడి చేయడం లేదు. దీనికి కారణం ప్రభాస్ కి నిర్మాత కీ మధ్య వచ్చిన గొడవే అంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ మాసాల మూవీ సలార్. డిసెంబర్ 22న ఈ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అంటే విడుదలకు ఇంకా 8 రోజులు మాత్రమే టైం ఉంది. అయినా ఎక్కడా హడావిడి కనిపించడం లేదు. ఒక్క అప్డేట్ కూడా రాలేదు. పాటలు విడుదల లేదు. ప్రచారం లేదు. అసలేం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. ప్రభాస్ ఇంట్రో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. మరో హీరో పృధ్వీరాజ్ కేరళకే పరిమితమయ్యాడు. దీంతో సలార్ రిలీజ్ పై రకరకాల రూమార్స్ చక్కర్లు కొడుతున్నాయి.

గుంటూరు కారం సంక్రాంతికి విడుదలవుతోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక పాట రిలీజైంది. త్వరలో మరో సాంగ్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. నా సామి రంగా సినిమా పాటల ప్రచారం కూడా మొదలైంది. సైంధవ్ నుంచి కూడా పాటలొస్తున్నాయి. మరి సంక్రాంతి సినిమాల కంటే ముందు క్రిస్మస్ కానుకగా వస్తున్న సలార్ నుంచి ఎన్ని పాటలొచ్చాయి? అంటే సమాధానం లేని ప్రశ్న. సలార్ లో పాటలు తక్కువే. ఓ మాంటేజ్ సాంగ్ తో పాటు మరో థీమ్ సాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం ఈ 8 రోజుల్లో ఒక్క పాటైనా రిలీజ్ అవుతుందా? అంటే చెప్పలేం అంటున్నారు క్రిటిక్స్.

సలార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై కూడా క్లారిటీ మిస్ అవుతోంది. డిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులో టూర్స్ ఉన్నాయా లేవా? ప్రభాస్ తో ఇంటర్య్ఫూలు ఉంటాయా ఉండవా? కనీసం శృతిహాసన్ అయినా ప్రమోషన్ కి వస్తుందా రాదా? అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది. అయితే సలార్ టీం రెండో ట్రైలర్ విడుదల చేసి.. ప్రీరిలీజ్ ఫంక్షన్ స్కిప్ కొట్టి నేరుగా రిలీజ్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్. సలార్ సినిమాకి తెలుగులో బజ్ ఉండొచ్చు. ఏ పబ్లిసిటీ లేకున్నా ఓపెనింగ్స్ రావచ్చు. కానీ మిగిలిన భాషల సంగతేంటి? అసలు సలార్ మేకర్స్ ఎందుకిలా చేస్తున్నారు ? కేజీఎఫ్ సిరీస్ రిలీజ్ విషయంలో హోంబలే ఫిల్మ్స్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దేశం మొత్తం చుట్టొచ్చింది. దొరికిన ప్రతి ఛాన్స్ నీ ఊపయోగించుకుంది. కానీ అదే సంస్థ నిర్మించిన సలార్ కి మాత్రం నో ప్రమోషన్.

సలార్ ని ప్రమోట్ చేయడం ప్రభాస్ కి ఇష్టం లేదా? లేక సినిమా నుంచి వదలడానికి కంటెంట్ లేదా? అసలు ఏం జరుగుతోంది. సలార్ ని తెలుగులో భారీ రేట్లకు అమ్మారు. నైజాంలో 90 కోట్లు తీసుకున్నారు. ఆంధ్ర, సీడెట్ లో కూడా ఇదే రేంజ్ లో ఛార్జ్ చేశారు. మరి బయ్యర్లు సేఫ్ అవ్వాలి అంటే ఎంతో కొంత ప్రమోషన్ జరగాలి. కానీ నిర్మాతలకు ఈ విషయం పట్టడం లేదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి సరైనా హిట్ లేదు. సలార్ తర్వాత ఇప్పట్లో మరో సినిమా విడుదల లేదు. సలార్ ఫస్ట్ పార్ట్ కు సరైన స్పందన లేకుంటే… రెండో భాగం పరిస్థితి ఏంటి?.మొత్తానికి ఓ పాన్ ఇండియా సినిమాకు జరగాల్సిన స్థాయిలో సలార్ కు ప్రచారం జరగట్లేదు. మరి దీనిపై ప్రభాస్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.