సలార్ 2 జోక్ కాదు… కాని ఎలా సాధ్యమో రాజాసాబ్ కే తెలియాలి…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేకుండానే తన సినిమా లోని 40 శాతం సీన్లను గ్రాఫిక్స్ కోసం, హీరో లేకుండానే తీశాడు రాజమౌళి. దానికి టెక్నీకల్ రీజనుంది.. అయినా అదో వింతగా సినీ జనం ఈ న్యూస్ వినగానే షాక్ అయ్యారు. ఇప్పుడు అంతకంటే పెద్ద వింతే జరిగింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేకుండానే తన సినిమా లోని 40 శాతం సీన్లను గ్రాఫిక్స్ కోసం, హీరో లేకుండానే తీశాడు రాజమౌళి. దానికి టెక్నీకల్ రీజనుంది.. అయినా అదో వింతగా సినీ జనం ఈ న్యూస్ వినగానే షాక్ అయ్యారు. ఇప్పుడు అంతకంటే పెద్ద వింతే జరిగింది. సెట్లో హీరో లేడు…అలానే దర్శకుడు అడుగుపెట్టలేదు. అయినా సలార్ 2 షూటింగ్ జరిగింది. ఏకంగా 4 రోజులు పాటు సలార్ 2 షూటింగ్ ని పూర్తిచేశారు. ఒకవైపు ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాను మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాకే కమిటయ్యాడు. అలాంటప్పుడు సలార్ 2 షూటింగ్ అనేది ఇంపాజిబుల్. ఇక ది రాజాసాబ్ ని పూర్తి చేయాలనుకుంటూనే, ఫౌజీ తో బిజీ అయ్యాడు ప్రభాస్. సో రెబల్ స్టార్ రెండేళ్లవరకు ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు… ప్రశాంత్ నీల్ డ్రాగన్ పూర్తి చేసేవరకు, మరో దిక్కుచూసే అవకాశం రాదు. అలాంటప్పుడు సలార్ 2 షూటింగ్ అనేదే అసాధ్యం.. కాని హీరో, దర్శకుడు లేకుండానే షూటింగ్ అనేదే షాకింగ్ గా ఉంది.. ఇంతకి ఇదేలా సాధ్యం..? ఎందుకలాంటి సాహసం చేశారు? నిజంగా సలార్ 2 షూటింగ్ కంటిన్యూ అయ్యే అవకాశాలెంత..?
సలార్ 750 కోట్ల రాబట్టాక సలార్ 2 మొదలౌతుందని చాలా ప్రచారాలు జరిగాయి. కాని సలార్ 2 స్టార్ట్ కాలేదు. ది రాజా సాబ్ ఫినిషింగ్ స్టేజ్ లోఉంది. ఫౌజీ లాంచైంది. 2025 సంక్రాంతికి సందీప్ రెడ్డి మేకింగ్ లో స్పిరిట్ లాంచై, సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.. ఆతర్వాతే సలార్ 2 అని తేలింది.
కాని ఈలోపే సలార్ 2 మూవీ తాలూకు 4 రోజులు షూటింగ్ జరిగింది. అంతే దెబ్బకి ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా ఆగిందా? లేదంటే అది సలార్ 2 షూటింగ్ ని ప్రశాంత్ నీల్ టీం ప్యార్ లల్ గా తీస్తోందా అన్న చర్చలు మొదలయ్యాయి
కాని రెండు నిజాలు కాదు. డ్రాగన్ లాంచైనా, ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. ఇక సలార్ 2 కోసం సెట్లోకి రెబల్ స్టార్ ప్రభాసే కాదు, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అడుగుపెట్టలేదు. కాని వీళ్లిద్దరు లేకుండానే 4 రోజులు పాటు సలార్ 2 షూటింగ్ జరిగింది. చిన్న పిల్లతో ఉండే రెండు సీన్లని సలార్ 2 కోసం ప్రశాంత్ నీల్ టీం మాత్రం తెరకెక్కింది.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్, ప్రజెంట్ డ్రాగన్ విషయంలో సీరియస్ గా ఉణ్నాడు. వార్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈలోపు సలార్ 2 తాలూకు హీరో లేని సీన్లు తన టీం తో తీయిస్తున్నాడు. ఇక సలార్ 2 ని ది రాజా సాబ్ స్టైల్లో అప్పుడో షెడ్యూల్, అప్పుడో షెడ్యూల్ పూర్తి చేస్తూ వస్తుంటాడట.
అలాని పూర్తిగా సలార్ 2 కోసంమే టైం స్పెండ్ చేసేపరిస్థితి లేదు. డ్రాగన్ తీస్తూనే, మధ్య మధ్యలోని గ్యాప్స్ లో ప్రభాస్ డేట్లిస్తే, రాజా సాబ్ ని అప్పడప్పుడూ తీస్తూ వచ్చినట్టు తీస్తారట. ఇది నిజంగా తెలివైన నిర్ణయం
ఇక ఫౌజీ ని జూన్ లోగా పూర్తి చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 10న ది రాజా సాబ్ అంటే, ఇది సంక్రాంతి లోపు షూటింగ్ పూర్తవుతుందని తేలింది. సో సలార్ 2 ని అప్పడప్పుడు షూట్ చేస్తూ, ప్రశాంత్ నీల్, అప్పడప్పుడు సెట్లో అడుగుపెడుతూ ప్రభాస్ ఈమూవీని వచ్చే ఏడాది సమ్మర్ లోగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట.