PRABHAS: ప్రభాస్‌కు సలార్ సినిమా నచ్చలేదా..? ప్రమోషన్‌కు రావడం లేదెందుకు..?

కంటెంట్‌లో ఏదో లోపం లేకపోతే ఎందుకు ప్రభాస్ ప్రమోషన్స్‌కి రావడం లేదు. ఈ డౌట్లలో కొంతవరకు నిజం ఉన్నట్టే ఉంది. ఎందుకంటే ఈమూవీ ఫస్ట్ కాపీ తాలూకు రిపోర్ట్ బయటికి లీకైంది. సలార్‌లో హీరో ఇంట్రడక్షన్ అరగంట వరకు ఉండదట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2023 | 05:46 PMLast Updated on: Dec 12, 2023 | 5:46 PM

Prabhas Have Doubts On Salaar Content

PRABHAS: సలార్ మూవీ నిజంగా రెబల్ స్టార్ ప్రభాస్‌కి నచ్చలేదా..? ఫస్ట్ కాపీ చూసిన ప్రభాస్ నిజంగానే డిసప్పాయింట్ అయ్యాడా..? కంటెంట్‌లో ఏదో లోపం లేకపోతే ఎందుకు ప్రభాస్ ప్రమోషన్స్‌కి రావడం లేదు. ఈ డౌట్లలో కొంతవరకు నిజం ఉన్నట్టే ఉంది. ఎందుకంటే ఈమూవీ ఫస్ట్ కాపీ తాలూకు రిపోర్ట్ బయటికి లీకైంది. సలార్‌లో హీరో ఇంట్రడక్షన్ అరగంట వరకు ఉండదట. హీరో చిన్నప్పటి సీన్లే 15 నిమిషాలుంటే, హీరో ఫ్రెండ్ సీన్లు మరో 15 నిమిషాలుంటాయట.

Jr NTR: దేవర రాక ఆలస్యం.. వార్ 2 కి బ్రేక్..

అంతేకాదు ఫస్ట్ హాఫ్ మొత్తం గంటన్నరలో, గంట నిడివి అసలు ప్రభాస్ సందడే ఉండదని, మొత్తం ఫ్రుథ్వీరాజ్ వెర్షనే కనిపిస్తుందని తెలుస్తోంది. అదే నిజమైతే ట్రైలర్‌లో చూపించిందే సినిమాలో ఉండబోతోందా..? ఏదో హైప్‌ తగ్గించాలని, హీరో తాలూకు విజువల్స్‌ని ట్రైలర్ సగం పూర్తయ్యాకే రివీల్ చేశాడు డైరెక్టర్ అన్నారు. కాని సినిమాలో కూడా హీరో అసలు విశ్వరూపం సెకండ్ పార్ట్‌లోనే ఉంటుందనే కామెంట్స్ పెరిగాయి. ఫిల్మ్ టీం కూడా ఫస్ట్ కాపీ చూసి ఇదేదో సీక్వెల్ కోసం హీరోని దాచినట్టుందనే మాటలు అన్నారు. అదే విషయం బయటకు తెలియడంతో సలార్ ప్రమోషన్‌కి ప్రభాస్ నో చెప్పాడని అనుకోవాల్సి వస్తోంది.

నిప్పులేనిదే పొగరాదన్నది సామెత కాదు.. రియాలిటీ అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ యాంటీ ఫ్యాన్స్ జోరు పెరిగింది. ఏదేమైనా సినిమా అన్నాక హైప్ పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రీరిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వూలు ఇవ్వట్లేదన్న మాట నమ్మశక్యంగా లేదు. ఈలోపు ఇలాంటి పుకార్లు రావటంతో సలార్ కంటెంట్ మీదే అనుమానాలు పెరుగుతున్నాయి.