SALAAR: డార్లింగ్‌ ఎక్కువగా కనిపించడా.. సలార్‌లో ప్రభాస్‌ రోల్‌ తగ్గించారా..?

టీజర్‌, ట్రైలర్‌లో ప్రభాస్ పెద్దగా కనిపించకపోవడంతో ప్యాన్స్‌ డల్‌ అయిపోయారు. సలార్‌ టీజర్‌ కథలా సాగింది. హీరోను బిల్డప్‌ చేసేలా టినూ ఆనంద్ మాటలతో టీజర్‌ నడించింది. ఇక ట్రైలర్‌లో కథను చెప్పే క్రమంలో రెండు నిమిషాలు గడిచాకగానీ.. ప్రభాస్‌ ఎంట్రీ ఇవ్వడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2023 | 01:53 PMLast Updated on: Dec 05, 2023 | 1:53 PM

Prabhas Have Less Screen Space In Salaar

SALAAR: సలార్‌లో ప్రభాసే హీరో అయినా.. ఎక్కువసేపు కనిపించడా..? కథంతా హీరో చుట్టూ తిరిగినా.. మిగిలిన క్యారెక్టర్సే డామినేట్‌ చేస్తాయా..? టీజర్‌.. ట్రైలరే ఇలా వుంటే.. సినిమాలో సలార్ స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఎన్ని నిమిషాలు ఉంటుంది..? మూడున్నర నిమిషాలున్న ట్రైలర్‌లో డార్లింగ్‌ నిమిషం మాత్రమే ఎందుకు కనిపించాడు..? ఇప్పుడు ఇదే చర్చ. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు సరైన హిట్‌ లేదన్న డిజప్పాయింట్‌మెంట్‌లో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ వున్నారు. సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ వంటి కంటిన్యూ డిజాస్టర్స్‌ తర్వాత వస్తున్న సలార్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

TELANGANA ASSEMBLY: వాళ్లే ఎక్కువ.. ఆ సామాజికవర్గం నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు..

అయితే.. టీజర్‌, ట్రైలర్‌లో ప్రభాస్ పెద్దగా కనిపించకపోవడంతో ప్యాన్స్‌ డల్‌ అయిపోయారు. సలార్‌ టీజర్‌ కథలా సాగింది. హీరోను బిల్డప్‌ చేసేలా టినూ ఆనంద్ మాటలతో టీజర్‌ నడించింది. ఇక ట్రైలర్‌లో కథను చెప్పే క్రమంలో రెండు నిమిషాలు గడిచాకగానీ.. ప్రభాస్‌ ఎంట్రీ ఇవ్వడు. యాక్షన్‌.. బిల్డప్‌ షాట్స్‌.. డైలాగ్‌తో సరిపెట్టాడు దర్శకుడు. టీజర్‌, ట్రైలర్‌లో ప్రభాస్‌ చూడ్డానికి బాగున్నా.. ఎక్కువ సేపు చూపించలేదని ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు. సలార్‌ ట్రైలర్‌ చూస్తుంటే.. కెజిఎఫ్‌2 గుర్తుకొస్తోంది. వెనకాల డార్క్‌ షేడ్‌ విజువల్స్‌.. మాఫియా రాజ్యంలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత చూస్తుంటే.. కథ వేరైనా.. మరోసారి కేజీఎఫ్‌2 చూసినట్టువుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సలార్‌లో చెప్పిన ‘ప్లీజ్‌.. ఐ.. కైండ్లీ.. రిక్వస్ట్..’ డైలాగ్‌ కెజిఎఫ్‌2 ట్రైలర్‌లో యశ్‌ చెప్పిన వైలెన్స్‌ వైలెన్స్‌ డైలాగ్‌ను గుర్తుచేస్తోంది. సలార్‌ రిలీజ్‌కు ఇంకా 20 రోజులు కూడా లేదు. ట్రైలర్‌ వచ్చిందన్న పేరేగానీ.. సందడి కనిపించడం లేదు.

భారీ ఈవెంట్‌లో ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తారనుకుంటే.. అదీ లేదు. నెల ముందు నుంచే ప్రమోషన్‌ మొదలెడితేగానీ.. ఇలాంటి పాన్‌ ఇండియా మూవీస్‌కు టైం సరిపోదు. కానీ.. ఇంతవరకు ప్రమోషన్‌ స్టార్ట్‌ చేయలేదు. వరుస ఫ్లాపులతో ప్రభాస్‌ కావాలనే.. ప్రమోషన్‌ తగ్గించేస్తున్నాడా..? అనిపిస్తోంది. సాహో.. రాధేశ్యామ్‌ రిలీజ్‌ టైంలో వరుస ఇంటర్వ్యూస్‌ కూడా ఇచ్చిన ప్రభాస్‌.. ఆదిపురుష్‌ దగ్గరకొచ్చేసరికి తెలుగులో ఒక్క ఈవెంట్‌ మినహా మరో కార్యక్రమం చేయలేదు. మరి సలార్‌ ప్రమోషన్‌ ఎలా వుటుందో చూడాలివ మరి.