PRABHAS: భయపెడతాడా..? భయపడతాడా..? ప్రభాస్ కొత్త మూవీ రిస్కేనా..

మళ్లీ ఊహించని రేంజ్‌లో ప్రభాస్ హర్రర్ మూవీ చేస్తున్నాడు. అందులోనూ హర్రర్ కామెడీ కాబట్టి.. మరో పౌర్ణమి, మరో చక్రం అంటున్నారు. అసలే పెద్ద హీరోలని హ్యాండిల్ చేయని మారుతి మేకింగ్‌లో ప్రభాస్ సినిమా అంటే ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2024 | 08:05 PMLast Updated on: Jan 08, 2024 | 8:05 PM

Prabhas Horro Movie With Maruthi Is Making Doubts In Fans

PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్ హర్రర్ మూవీ చేయటం రిస్కేనా..? ఇది సోషల్ మీడియాలో పెరిగిన నెగెటివ్ వైబ్రేషన్. అసలే బాహుబలి తర్వాత వరుస పంచ్‌లు పడ్డాక, అతి కష్టం మీద సలార్ సక్సెస్‌తో మళ్లీ పాత ప్రభాస్‌ని చూశారు ఫ్యాన్స్. మాస్ యాక్షన్ డ్రామాలతో తను దాడి చేస్తే బాక్సాఫీస్ తుక్కు తుక్కుగా ఎలా మారిపోతుందో చూశాం. ఇప్పుడు మళ్లీ ఊహించని రేంజ్‌లో ప్రభాస్ హర్రర్ మూవీ చేస్తున్నాడు. అందులోనూ హర్రర్ కామెడీ కాబట్టి.. మరో పౌర్ణమి, మరో చక్రం అంటున్నారు.

Devara movie : సముద్రాన్ని ఎరుపెక్కించిన దేవర

అసలే పెద్ద హీరోలని హ్యాండిల్ చేయని మారుతి మేకింగ్‌లో ప్రభాస్ సినిమా అంటే ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఇలానే గతంలో అనుభవం లేని సుజిత్‌తో సాహో చేసి చేతులు కాల్చుకున్నాడు ప్రభాస్. తర్వాత జిల్ ఫేం రాధాకృష్ణతో రాధేశ్యామ్ తీశాడు. అక్కడా సింక్ అవని జోనర్, అనుభవంలేని దర్శకుడు. మొత్తంగా మరో ఫెల్యూర్. ఇక ఆదిపురుష్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఏదో హిందీలో తానాజీతో హిట్ తీశాడని ఓం రౌత్‌ని నమ్మితే సీన్ రివర్స్ అయ్యింది. ఆదిపురుష్‌లో వరస్ట్ గ్రాఫిక్స్, మ్యాటర్‌లేని డైలాగులు, క్లారిటీ లేని జడ్జిమెంట్‌తో ప్రభాస్ కెరీర్‌లో ఆదిపురుష్ ఓ మచ్చలా మారింది. వివాదంగా మారి కోర్టు కేసుల వరకు వెళ్లింది.

ఇన్ని జరిగాయి కాబట్టే మారుతి మేకింగ్‌లో ప్రభాస్ హర్రర్ కామెడీ చేస్తున్నాడంటే ఫ్యాన్స్ కంగారు పడాల్సి వస్తోంది. సలార్‌తో అతి కష్టం మీద ప్రభాస్ మళ్లీ పాత దూకుడు షురూ చేశాడు. కల్కి ఎలాగూ హిట్ అవుతుందని అందరికీ నమ్మకం ఉంది. కానీ, ఆరు అడుగుల 4 అంగులాల భారీ కటౌట్ డార్లింగ్‌తో కామెడీ చేస్తేనే కాసులు కురవలేదు. అలాంటిది హర్రర్ కామెడీ చేస్తే ఇంకెంత రిస్క్ అనంటున్నారు. మొత్తానికి మారుతి మీద అపనమ్మకానికి తోడు హర్రర్ కామెడీ జోనర్ ప్రభాస్ ఫ్యాన్స్‌ని భయపెడుతోంది.