ప్రభాస్, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్.. అంతా డూపే.. లోపలేం లేదు డొల్ల..!
ఆ సినిమాలో మా హీరో యాక్షన్ సీన్స్ చూడండిరా..! అదరగొట్టాడు మా వాడు.. ఓ రేంజ్ లో యాక్షన్ చంపేశాడు అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అభిమానులు.

ఆ సినిమాలో మా హీరో యాక్షన్ సీన్స్ చూడండిరా..! అదరగొట్టాడు మా వాడు.. ఓ రేంజ్ లో యాక్షన్ చంపేశాడు అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అభిమానులు. కానీ అక్కడ కనిపించని వాళ్ళ హీరో కాదు అని తెలిస్తే పాపం వాళ్ళు ఏమైపోతారో..? అదేంటి అలా అంటున్నారు.. స్క్రీన్ మీద ఒళ్ళు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలను పట్టుకొని అలా అంటే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా అనుకోవచ్చు. కానీ అంత సినిమా లేదు.. ఎందుకంటే స్క్రీన్ మీద యాక్షన్ సీన్స్ చేసేది స్టార్ హీరోలు కాదు వాళ్ళ బాడీ డబుల్స్. మన భాషలో చెప్పాలంటే డూప్ అన్నమాట. అవును ఇది ఎప్పటినుంచో ఉంది కదా.. కష్టమైన యాక్షన్ సీన్స్ హీరోల డ్యూక్ చేస్తారు అనే విషయం అందరికీ తెలుసు కదా అనుకోవచ్చు. కానీ కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే చేస్తే ఓకే.. కానీ ఇప్పుడున్న బాడీ డబుల్స్ యాక్షన్ మాత్రమే కాదు ఇంకా చాలా చేస్తున్నారు.
ఒక ముక్కలో చెప్పాలంటే సగం సినిమా బాడీ డబుల్స్ తోనే చేస్తున్నారు దర్శకులు. హీరోలకు ఎంత రెమ్యూనరేషన్ చేయాలో అందులో దాదాపు పావు వంతు బాడీ డబుల్స్ కు ఇవ్వాల్సి వస్తుంది. హీరోలని ఎలా చూసుకుంటున్నారో వాళ్ళ బాడీ డబుల్స్ ను కూడా అంతే బాగా చూసుకోవాలి. తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ కు ఎక్కువగా ఈ బాడీ డబుల్ ఫార్మేట్ అప్లై చేస్తున్నారు దర్శకులు. సలార్ సినిమాలో చాలావరకు యాక్షన్ సీన్స్ ప్రభాస్ చేయలేదు.. చేసింది ఆయన బాడీ డబుల్ అంటే మీరు నమ్ముతారా..? కేవలం క్లోజప్ షాట్స్ లో మాత్రమే హీరోలను వాడుకొని.. మిగిలిన సీన్స్ అన్ని వాళ్ళ బాడీ డబుల్స్ తో పూర్తి చేస్తున్నారు దర్శకులు. ఇది ఒక ప్రభాస్ విషయంలో మాత్రమే కాదు చాలా మంది హీరోలకు ఇదే ఫార్ములా అప్లై అవుతుంది. కొలతలు ఇచ్చేసి వెళ్తా.. మిగిలింది ఏదైనా ఉంటే నా బాడీ డబుల్ తో చూసుకో అన్నట్టు ఉంది స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న మేకర్స్ పరిస్థితి.
స్టార్ హీరోలకు ఫేస్ వ్యాల్యూ ఉంటుంది కాబట్టి వాళ్లు కూడా ఏమీ అనలేకపోతున్నారు. మన దగ్గర కాస్త తక్కువ కానీ బాలీవుడ్ లో ఒక్కో హీరోకు కనీసం ముగ్గురు నలుగురు బాడీ డబుల్స్ ఉన్నారు. షారుక్, సల్మాన్ లాంటి హీరోల సినిమాల్లో సగానికి పైగా షూటింగ్ వాళ్లే చేస్తారు. కేవలం మొహం మాత్రమే హీరోలది మిగిలిన బాడీ అంతా వేరే వాళ్ళదే. అదేంటి అంటే అదంతే అంటున్నారు. ఒకప్పుడు కూడా హీరోలు ఈ డూప్ సిస్టమ్ వాడుకునే వాళ్ళు కానీ మరీ ఇప్పుడున్న హీరోలు వాడుకున్నంత రేంజ్ లో అయితే కాదు. ఏదో తల్లి బిడ్డ న్యాయమన్నట్టు.. యాక్షన్ సన్నివేశాల వరకు మీరు చేయండి మిగిలినది మేము చూసుకుంటాం అనేవాళ్ళు. ఇప్పుడేమో మొత్తం మీరే చేయండి క్లోజప్ షాట్స్ ఏమైనా ఉంటే మేము వచ్చి చేస్తామంటున్నారు. మరి ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి..!