ప్రభాస్ సినిమాను సీక్రెట్ గా చూసిన స్టార్ హీరో, అదీ హైదరాబాద్ లో…?

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ మారిపోయింది. ఆయన సినిమాల కోసం బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా జనాలు ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వందల కోట్ల వసూళ్లతో దూసుకుపోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 2, 2024 | 06:21 PMLast Updated on: Sep 02, 2024 | 6:21 PM

Prabhas Is A Star Hero Who Watched The Movie Secretly

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ మారిపోయింది. ఆయన సినిమాల కోసం బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా జనాలు ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వందల కోట్ల వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇటీవల వచ్చిన కల్కీ సినిమా అయితే ఏకంగా 1200 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమాకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది.

ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు కూడా ఆ రికార్డ్ అందుకోవడం సాధ్యమయ్యే విధంగా కనపడటం లేదనే చెప్పాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ కు రెండు మూడు సినిమాలు షాక్ ఇచ్చినా ఆ తర్వాతి నుంచి మాత్రం సీన్ మారింది. హిట్ ట్రాక్ లో వెళ్ళడం మొదలయింది. సలార్ సినిమా సూపర్ హిట్ కాగా… ఇటీవల వచ్చిన కల్కీ సినిమా అయితే బాలీవుడ్ ని సైతం షేక్ చేసింది అనే చెప్పాలి. సలార్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడినా వాటిని అందుకుని భారీ వసూళ్లు సాధించింది. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ సినిమాను తెరకెక్కించాడు.

సలార్ సినిమా గురించి ఇప్పుడో వార్త వైరల్ గా మారిపోయింది. తమిళ స్టార్ హీరో విజయ్… సలార్ సినిమా విడుదలైన రోజున హైదరాబాద్ లోని గోకుల్ థియేటర్ లో చూసారట. ప్రభాస్ సినిమాను మాస్ థియేటర్ లో చూడాలని భావించిన విజయ్… హైదరాబాద్ వచ్చి గోకుల్ థియేటర్ లో చూసారట. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ తమ హీరో సినిమాను హైదరాబాద్ లో చూసారా అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి అది ఎంత వరకు నిజమో విజయ్ చెప్పాలి.