Kalki Pawan babu : ఒకే వేదికపై పవన్, ప్రభాస్…
సలార్ (Salaar) తర్వాత మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 AD’ (Kalki 2898 AD) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas is getting ready to shake the Indian box office once again after Salaar.
సలార్ (Salaar) తర్వాత మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో.. భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి ‘. వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. జూన్ 10న ట్రైలర్ విడుదలవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఆసక్తికరంగా మారింది.
‘కల్కి’ చిత్రంలో ప్రభాస్ ఉపయోగించిన వెహికిల్ ‘బుజ్జి’ ని పరిచయం చేయడం కోసం ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ ను తలదన్నేలా అత్యంత వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారట.ఇక ఈ ఈవెంట్‌కు ఏపీ కొత్త సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరిని ముఖ్య అతిథులుగా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 23 లేదా 25న జరిగే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన సీఎం హోదాలో హాజరు కానున్నారని సమాచారం.ఒకవేళ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ‘కల్కి’ ఈవెంట్‌కి వస్తే.. మామూలుగా ఉండదనే చెప్పాలి. పవన్, ప్రభాస్‌ను ఒకే వేదిక మీద చూస్తే.. అభిమానులు కంట్రోల్ చేయడం కష్టం. అయితే.. ఈ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ జరగనుంది నిజంగానే.. చంద్రబాబు, పవన్ వస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.