PRABHAS: రెబల్ స్టార్ దర్శనం లేదా.. బయటికి రాడా..?
సలార్ రిలీజ్‌కి వారం కూడా టైం లేదు. అయినా ప్రభాస్ దర్శన భాగ్యం దొరకట్లేదు. ఎందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ముందుకు రాలేకపోతున్నాడు..? నిజంగా తనింకా మోకాలి సర్జరీ నుంచి కోలుకోలేదా..? కేవలం సినిమా హైప్ తగ్గించే పనే అయితే.. మరీ ఇంత ధారునంగా ప్రమోషన్‌ని జీరో కంటే తక్కువగా మార్చరు.
PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్‌ని చూడాలని ఉందంటున్నారు ఫ్యాన్స్. ఆమధ్య ఏయిర్ పోర్ట్‌లో తను దిగి వచ్చిన విజువల్స్ కనిపించాయి. కానీ, అప్పటి నుంచి ప్రభాస్ దర్శన భాగ్యమే అభిమానులకు దొరకట్లేదు. కారణం ఏంటో అర్ధం కావట్లేదు. మోకాలి సర్జరీ తర్వాత ఇండియా కొచ్చిన ప్రభాస్ కొన్నిరోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుని ఫిజియో థెరపీ చేయించుకున్నారు. ఆ తర్వాత సలార్ ప్రమోషన్స్‌లో జాయిన్ అవుతాడన్నారు.
MAHESH BABU: మహేశ్ బాబు మీద విషం చిమ్ముతోంది వాళ్లేనా..?
తీరా చూస్తే సలార్ రిలీజ్‌కి వారం కూడా టైం లేదు. అయినా ప్రభాస్ దర్శన భాగ్యం దొరకట్లేదు. ఎందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ముందుకు రాలేకపోతున్నాడు..? నిజంగా తనింకా మోకాలి సర్జరీ నుంచి కోలుకోలేదా..? కేవలం సినిమా హైప్ తగ్గించే పనే అయితే.. మరీ ఇంత ధారునంగా ప్రమోషన్‌ని జీరో కంటే తక్కువగా మార్చరు. ఏం జరుగుతోంది..? కొందరు యాంటిఫ్యాన్స్ అయితే ప్రభాస్‌కు జుట్టు సమస్య ఉందని, అందుకే బయటకు రావట్లేదని కామెంట్లు చేస్తున్నారు.
ఇంకొందరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవటం వల్లే ప్రభాస్ బయటికి రావట్లేదని ఇంకొందరు గుసగుసలు పెంచారు. ఇవన్నీ గాలి మాటలే అయినా, ప్రభాస్ సలార్ ప్రమోషన్ తాలూకు ఈవెంట్లు ప్లాన్ చేయట్లేదు. దర్శక నిర్మాతలు తప్ప ప్రభాస్ సందడి లేకపోవటంతో ప్రభాస్ మీద లేని పోని డౌట్లు పెరిగిపోతున్నాయి