Prabhas: ప్రభాస్ ని టార్గెట్ చేసిన వరుణ్ తేజ్, ఉస్తాద్ రామ్..

ఇంతకాలం శర్వానంద్, వరుణ్ తేజ్ తమకు పెళ్లి ఎప్పుడంటే, సీనియర్ ప్రభాస్ ఆన్నకు పెళ్లయ్యాకే తమదన్నారు. కట్ చేస్తే వీళ్లే ముందడుగు వేశారు. దీంతో ప్రభాస్ పెళ్లి మీద ప్రెజర్ పెరిగేలా ఉంది. అసలే ప్రభాస్ 45లోకి అడుగుపెట్టే టైం దగ్గరకొస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 15, 2023 | 05:24 PMLast Updated on: Jun 15, 2023 | 5:25 PM

Prabhas Is Now In Que For Marriage After Varun Tej And Ram Sharwanand

Prabhas: యంగ్ రెబల్ స్టార్‌లో టెన్షన్ పెరిగింది. తననే ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్, ఉస్తాద్ రామ్ టార్గెట్ చేశారు. ఊపిరి తీసుకోకుండా చేస్తున్నారు. మొన్నే లావణ్య త్రిపాఠితో ప్రేమని కన్ఫామ్ చేసిన వరుణ్ తేజ్.. ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లికి సిద్దమయ్యాడ . ఇప్పుడు హీరో రామ్ కూడా ఏడడుగులు నడవటం ప్రాక్టీస్ చేస్తున్నాడట.

ఆల్రెడీ అమ్మాయి దొరికిందని తెలుస్తోంది. రీసెంట్‌గా శర్వానంద్ కూడా బిజినెస్ మ్యాన్ కూతుర్ని పెళ్లి చేసుకుని సెటిలయ్యాడు. ఇప్పుడు ఉస్తాద్ రామ్ కూడా బిజినెస్ మ్యాన్ కూతురితో ఏడడుగులు నడవబోతున్నాడు. ఆల్రెడీ వరుణ్ తేజ్ లావణ్యతో ఏడడుగులు నడవటం కన్ఫామ్ అయ్యింది. ఒకేసారి ఈ ముదుర్లు పెళ్లికి సై అనటంతో, ఇక టాలీవుడ్‌లో పెళ్లి కాని ప్రసాదు అంటే ప్రభాస్ పేరే వినిపిస్తుంది. ఇంతకాలం శర్వానంద్, వరుణ్ తేజ్ తమకు పెళ్లి ఎప్పుడంటే, సీనియర్ ప్రభాస్ ఆన్నకు పెళ్లయ్యాకే తమదన్నారు. కట్ చేస్తే వీళ్లే ముందడుగు వేశారు. దీంతో ప్రభాస్ పెళ్లి మీద ప్రెజర్ పెరిగేలా ఉంది. అసలే ప్రభాస్ 45లోకి అడుగుపెట్టే టైం దగ్గరకొస్తోంది.

ఇంకా డిలే చేస్తే 60లో పడబోతున్న సల్మాన్ లానే ప్రభాస్ లైఫ్‌లో వైఫ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రభాస్ ఎక్కడి కెళ్లినా, తన కొత్త సినిమా ప్రమోషన్‌లో కెళ్లినా మీడియా నుంచి పెళ్లి ప్రశ్నలు తప్పేలా లేవు. తోటి హీరోలు, యంగ్ హీరోలు పెళ్లి చేసుకుంటున్నారు. కాబట్టి కంపేరిజన్ వల్ల కూడా పెళ్లెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభాస్‌కి తలనొప్పులు పెరగనున్నాయి.