Prabhas: ఓర్నీ ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా టైటిల్ వెనుక ఇంత కథ ఉందా ?

ప్రాజెక్ట్ కే ప్రభాస్ హీరో గా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ మహా నటి ఫేమ్ నాగఅశ్విన్  డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కి 500 కోట్లు బడ్జెట్. అశ్వినీదత్ ఈ సినిమా కి నిర్మాత. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ అమెరికా లో రిలీజ్ అయింది. ఈ మూవీకి కల్కీ 2898 ఎడి అనే టైటిల్ అనౌన్స్ చేశారు. చిత్ర యూనిట్.. ఈ గ్లింప్స్ చూసినప్పటి నుంచి అందరికీ చాలా సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మూవీకి కల్కి అనే పేరు ఎందుకు పెట్టారు? అసలు కల్కి ఎవరు? కల్కీ అవతారం ఎప్పుడు మొదలౌతుంది? కల్కీ అవతారం మొదలైతే ఏం జరుగుతుంది? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. మరి వాటికి సమాధానాలేంటో ఓసారి చూద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 23, 2023 | 01:22 PMLast Updated on: Jul 23, 2023 | 1:22 PM

Prabhas Is Playing The Hero In Project K Kalkis Post Has Been Released

విష్ణు మూర్తికి చాలా అవతారాలు ఉన్నాయి. ఒక్కో యుగానికి ఆయన ఒక్కో అవతారం ఎత్తి శత్రు సంహారం చేస్తూ ఉంటాడు అనే మాట మీరు వినే ఉంటారు. అలాంటి అవతారాల్లో ఈ కల్కీ అవతారం కూడా ఒకటి. అయితే, ఈ యుగంలోనే కల్కీ అవతరించనున్నాడు. అయితే, మానవులు విపరీత ధోరణులకు అలవాటు పడి, భూమి పై పాపాలు పెరిగిపోయినప్పుడు ఈ కల్కీ అవతారాన్ని విష్ణుమూర్తి ఎత్తుతాడు. కల్కీ “శంభల” అనే గ్రామంలో విష్ణుయశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడట. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్టశిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు. కలక అంటే దోషాన్ని తొలగించేది అని అర్థం.

దోషాన్ని హరించే అవతారం గనుక కల్కీ అవతారం అన్న పేరు వచ్చిందని పండితులు చెబుతారు. కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందనీ, ఆ సమయంలో తాను కల్కీ గా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహా విష్ణువు చెప్పినట్టుగా పురాణాలలో ఉంటుంది. ఇప్పటి వరకు విష్ణుమూర్తి తొమ్మిది అవతారాలెత్తాడు. రామావాతరం పూర్తయ్యాక కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు. ద్వారకనీటమునిగి కృష్ణుడు అవతారంచాలించిన తర్వాత నుంచి కలియుగం ప్రారంభమైంది.

ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. అంటే, ఈ కాలంలో కల్కీ అవతారం ఎత్తే అవకాశం ఉంది. కాగా శంభల అనే గ్రామం ఎక్కడ ఉంది అనే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియకపోవడం విశేషం. ఆ గ్రామం గురించి తెలుసుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారట. అయితే, ఈ గ్రామం కేవలం పుణ్యాత్ములకు మాత్రమే కనపడుతుంది అనే నానుడి కూడా ఉంది. మరి కొందరేమో హిమాలయాల్లో ఈ గ్రామం ఉండి ఉండొచ్చు అని కొందరు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ కల్కీ ప్రస్తావను ప్రాజెక్ట్ కె మూవీలో తీసుకువచ్చారు. మరి ఈ సినిమాలో కల్కి దుష్ట సంహారం ఎలా చేస్తాడో తెలియాలంటే, మూవీ విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. ప్రభాస్ ఈ సినిమా లో కల్కి గా బాక్స్ ఆఫీస్ ని ఎలా షేక్ చేస్తాడో వెయిట్ చేసి చూడాల్సిందే