kalki 2898 AD: 22 భాషల్లో.. ఒకే ఒక్క పాటకి రెబల్ చిందులు..?

సాధారణంగా కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో పాటలంటేనే విచిత్రం.. అలాంటిది ఒకే పాటని 22 భాషల్లో ప్లాన్ చేయటం మరో వింత. నిజమే.. 10 భారతీయ భాషలు, ఇంగ్లీష్, జపనీస్‌తోపాటు 10 యూరోపియన్ లాంగ్వేజెస్‌లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2024 | 05:11 PMLast Updated on: Feb 24, 2024 | 5:11 PM

Prabhas Kalki 2898 Ad Have Two Songs One Song In 22 Languages

kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సెట్లో చిందేస్తున్నాడు. టక్కర టక్కర అంటూ మాస్ మతిపోటొగ్టే బీట్‌కి స్టెప్స్ వేస్తున్నాడు. 3 రోజుల సాంగ్ షూట్‌తోపాటు, 8రోజుల ప్యాచ్ వర్క్‌ని ప్లాన్ చేసింది సినిమాటీం. ఇక మే 9న సినిమా రాదు, వాయిదా అంటూ పెరిగిన ప్రచారానికి ఫిల్మ్ టీం ఫుల్ స్టాప్ పెట్టింది. సాధారణంగా కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో పాటలంటేనే విచిత్రం.. అలాంటిది ఒకే పాటని 22 భాషల్లో ప్లాన్ చేయటం మరో వింత.

Ram Charan: మెగా అభిమానులు బీ రెడీ.. గేమ్ చేంజర్ టీజర్ డేట్ ఫిక్స్

నిజమే.. 10 భారతీయ భాషలు, ఇంగ్లీష్, జపనీస్‌తోపాటు 10 యూరోపియన్ లాంగ్వేజెస్‌లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఇందులో మాటల్నే కాదు పాటల్ని కూడా అన్ని భాషల్లో పాడించాల్సి వస్తోంది. మన బీట్‌కి ఇంగ్లీష్ లిరిక్స్ ఎలా ఉంటుంది.. యూరోపియన్స్‌కి మన స్టైలాఫ్ సాంగ్స్‌ని పరిచయం చేస్తే ఇంకెలా ఉంటుంది.. త్రిబుల్ ఆర్ నాటునాటు చూసిన వరల్డ్ ఆడియన్స్‌కి ఇప్పడు కల్కి టీం అంతకుమించేలా సాంగ్ ఎక్స్‌పీరియన్స్‌ని రెడీ చేస్తోంది.

కల్కిలో మొత్తం రెండు పాటలుంటే, ఒకటి మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది. సో.. విజువల్స్ మీదొచ్చే పాట సంగతి పక్కన పెడితే, డాన్స్ నెంబర్‌గా ప్లాన్ చేసిన మాస్ సాంగ్‌ని మాత్రం డిస్క్ బ్యాక్ డ్రాప్‌తోప్లాన్ చేశారట. అలా అయితే అన్ని భాషల్లో అందరికీ ఈజీగా రీచ్ అవుతుందని ప్లాన్ చేశారట.