KALKI 2898 AD: స్ట్రాంగ్ వార్నింగ్.. కల్కి విషయంలో ఫ్యాన్స్ ఆగ్రహం
ఈ మూవీ వేసవి కానుకగా మే9వ తేదీన విడుదల కానున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించినప్పటికీ.. దీనిపై ఇప్పటికే సరైన క్లారిటీ రావడం లేదు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో మూవీ వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
KALKI 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. సలార్ లాంటి భారీ బ్లాక్ బ్లస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో హైఎక్స్‌పెక్టేషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై.. భారీ చిత్రాల నిర్మాత అశ్వనీదత్ ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నారు.
Rashmika-Vijay: నేషనల్ క్రష్‌కి రౌడీ బాయ్ గ్రాండ్ పార్టీ.. దుబాయ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ షురూ..!
అయితే.. ఈ మూవీ వేసవి కానుకగా మే9వ తేదీన విడుదల కానున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించినప్పటికీ.. దీనిపై ఇప్పటికే సరైన క్లారిటీ రావడం లేదు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో మూవీ వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రావకపోవడంతో.. సలార్ విషయంలో జరిగిన తప్పులే కల్కి విషయంలోనూ జరుగుతున్నాయా అంటూ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. పాన్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో యాంగ్జైటీగా ఎదురు చూస్తున్న కల్కి మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ స్పెషల్ పాత్రలో కనిపించనుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో పాటు అనేక మంది ప్రముఖులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ వాయిదాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ మే 9నే కల్కి రిలీజ్ అవుతుందని అనుకుంటే.. 35 రోజులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి.
PAWAN KALYAN: థియేటర్ల దగ్గర ఉన్న ఉద్యోగులు పింఛన్లు ఇవ్వడానికి లేరా.. ప్రభుత్వానికి పవన్ ప్రశ్న
మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కనీసం పాటలు, టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. అలా అని కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌ను దాటుకుని హాలీవుడ్ స్థాయిలో విడుదలకు సిద్దమవుతోంది. కానీ, అనుకున్న తేదీ ప్రకారం కల్కి థియేటర్లలోకి రావడం కష్టంగానే ఉంది. ఒకవేళ ముందుగా చెప్పిన ప్రకారమే మే 9న రిలీజ్ చేయాలనుకుంటే.. ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లోస్టార్ట్ చేయాలి కదా అని డార్లింగ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో వస్తున్న మూవీకి చేయాల్సిన ప్రమోషన్ ఇదేనా అని కామెంట్లు పెడుతున్నారు. ఆదిపురుష్, సలార్ విషయంలో జరిగిన తప్పులను ప్రస్తావిస్తున్నారు.
ముఖ్యంగా సలార్ విడుదల తేదీని సరైన టైమ్‌కు ప్రకటించకపోవడం వల్ల ఆ సినిమాకు 100-150 కోట్ల నష్టం వచ్చినట్లు అప్పట్లో టాక్ వినిపించింది. దీంతో ఆ తప్పులు కల్కి మేకర్స్ చేయొద్దని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సరైన రిలీజ్ డేట్ ఎంచుకోవాలని.. ప్రభాస్ రేంజ్, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రమోషన్స్ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మరి కల్కి విషయంలో మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి మరి.