KALKI 2898 AD: షాకింగ్.. ప్రభాస్ సినిమా బిజినెస్ అన్ని కోట్లా..?

కేవలం రెబల్ స్టార్ ఇమేజ్ వల్ల కల్కికి ఏకంగా 200 కోట్లు చెల్లించింది నెట్‌ఫ్లిక్స్. 22 భాషల్లో రిలీజ్ అయ్యే ఈ మూవీ అన్ని భాషల ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఒక్క మూవీకి 200 కోట్ల ఓటీటీ రైట్స్ అంటేనే అంతా షాక్ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 6, 2024 | 05:17 PMLast Updated on: Apr 06, 2024 | 5:17 PM

Prabhas Kalki 2898 Ad Movie Pre Release Business On Fire Creating Records

KALKI 2898 AD: కల్కి మూవీ మే 9న రిలీజ్ కావాలి. కాని మే 30 లేదా 31 కి వాయిదా అని ఒక రూమర్ వచ్చింది. తర్వాత కాదు జూన్ ఎండ్‌లో కల్కి రీసౌండ్ అని మరో ప్రచారం షురూ అయ్యింది. ఆఖరికి పుష్ప 2 వాయిదా పడితే ఆగస్ట్ 15 కి రావొచ్చనే గుసగుసల గోల ఎప్పటి నుంచో పెరిగింది. ఇవన్నీ పక్కన పెడితే, కేవలం రెబల్ స్టార్ ఇమేజ్ వల్ల కల్కికి ఏకంగా 200 కోట్లు చెల్లించింది నెట్‌ఫ్లిక్స్.

Manjummel Boys: తెలుగులోకి మంజుమ్మల్ బోయ్స్.. మనవాళ్లకు నచ్చిందా..?

22 భాషల్లో రిలీజ్ అయ్యే ఈ మూవీ అన్ని భాషల ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఒక్క మూవీకి 200 కోట్ల ఓటీటీ రైట్స్ అంటేనే అంతా షాక్ అవుతున్నారు. ఇక కేవలం సౌత్ సంబంధించి.. అంటే 4 భాషలకు సంబంధించిన సినిమా థియేట్రికల్ రైట్స్ 400 కోట్లు. ఇది కూడా మతిపోగొట్టే నెంబరే. హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్ ఎంతకు సేల్ అవుతాయో ఇంకా డిసైడ్ కాలేదు. శాటిలైట్ రైట్స్ అన్ని భాషలకు సంబంధించి ఏకంగా 120 కోట్లు పలికాయట. ఓవర్‌సీస్ రైట్స్ 80 కోట్లని తెలుస్తోంది. అన్నీ కలిపితే 800 కోట్లు. సో నార్త్ ఇండియా రైట్స్ కనీసం 200 కోట్ల ధర పలికినా రిలీజ్‌కిముందే 1000 కోట్ల బిజినెస్ జరిగినట్టే.

ఇంత బాగా ప్రిరిలీజ్ బిజినెస్ తాలూకు పనులు చక్కబెడుతున్న నిర్మాత అశ్వినీదత్, సినిమా రిలీజ్ విషయంలో మాత్రం కన్‌ఫ్యూజన్ పోగొట్టలేకపోతున్నాడు. ఉగాదికి ఏదైనా స్పెషల్ ఎనౌన్స్‌మెంట్ రావొచ్చంటున్నారు. కాని అక్కడ కూడా నిర్మాత సాలిడ్‌‌గా నిర్ణయం సుకోలేకపోతున్నాడట. ఏదున్నా శ్రీరామనవమిలోగా డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉందట. ఆరోజే వాయిదా తాలూకు స్పెషల్ ఎనౌన్స్‌మెంట్ రావొచ్చట.