KALKI 2898 AD: కల్కి అందుకే వాయిదా.. కాని ఎప్పుడో తెలుసా..?
కల్కి పాన్ ఇండియా మూవీ అయినా, ఏపీ, తెలంగాణ రెండు మార్కెట్లు ఈ సినిమాకు గుండెకాయలాంటిది. అందుకే ఇక్కడ ఎలక్సన్స్ హడావిడి నడుస్తుంటే, ఓటేసే మూడు రోజుల ముందు మూవీని విడుదల చేయటం సరైన పని కాదనే ఇక్కడ ఓట్ల పండగ అయిపోయాకే, మే 30 కి విడుదల చేయాలనుకుంటున్నారట.

KALKI 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి వాయిదా పడటం అఫీషియల్ అయ్యింది. ఈనెల 17న శ్రీరామ నవమి రోజున కొత్త విడుదల తేదీ ప్రకటించబోతున్నారు. ఐతే ఏపీలో ఎలక్షన్స్ వల్లే విడుదల తేదీని మే 9 నుంచి మే 30కి మార్చే అవకాశం ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే నిజం అయ్యేలా ఉంది. కల్కి పాన్ ఇండియా మూవీ అయినా, ఏపీ, తెలంగాణ రెండు మార్కెట్లు ఈ సినిమాకు గుండెకాయలాంటిది.
Allu Arjun: అన్నీ గాలి వార్తలే.. అల్లు అర్జున్‌ను పక్కన పెట్టిన అట్లీ
అందుకే ఇక్కడ ఎలక్సన్స్ హడావిడి నడుస్తుంటే, ఓటేసే మూడు రోజుల ముందు మూవీని విడుదల చేయటం సరైన పని కాదనే ఇక్కడ ఓట్ల పండగ అయిపోయాకే, మే 30 కి విడుదల చేయాలనుకుంటున్నారట. అంతా అనుకున్నట్టు పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవటం అనేదే జరగలేదు. గ్రాఫిక్స్ క్వాలిటీలో తేడాలేదు. ఫస్ట్ కాపీ కూడా రెడీ. కాని కొన్ని కొత్త సీన్లు, ఓ సాంగ్ యాడ్ చేయాలని మొన్న ఇటలీలో సాంగ్, ఈమధ్య ప్యాచ్ వర్క్ పనులుచేశారు. అవి కూడా యాడ్ చేయాలనుకున్నారు కాబట్టి తీశారు.
లేదంటే ఎప్పుడో ఫస్ట్ కాపీ సిద్దం అని తెలుస్తోంది. దీంతో కల్కి రెడీ ఫర్ రిలీజ్. ఎటొచ్చి ఎలక్షన్ల హడావిడే ఈ మూవీ విడుదలని వాయిదా పడేలా చేస్తోంది. మిగతా కారణాలే నిజమైతే, మే 9 నుంచి మే 30కి కాకుండా జూన్ జులైకి వాయిదా పడే అవకాశం ఉండేది. కాబట్టే అనుకున్న తేదీకంటే 21 రోజుల తర్వాత ఈ సినిమా రాబోతోంది.