KALKI 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కల్కి రిలీజ్ డేట్ వచ్చేసింది..
నిజానికి ఈ చిత్రం మే 6న విడుదల కావాలి. కానీ, ఎన్నికల హడావిడి ఉండటంతో ప్రేక్షకుల ఫోకస్ అంతా అటువైపే ఉంటుందని సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత రిలీజ్ డేట్‌పై అనేక చర్చలు జరిగాయి.

KALKI 2898 AD: తెలుగు ప్రేక్షకులతోపాటు ఇండియన్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి కల్కి 2898 ఏడి. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిలిం ఇది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఖరారు చేసింది యూనిట్. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా కల్కి రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నిజానికి ఈ చిత్రం మే 6న విడుదల కావాలి.
SSMB29: 9 నెలల్లో మహేశ్ బాబు సినిమాని పూర్తి చేయబోతున్నాడా..?
కానీ, ఎన్నికల హడావిడి ఉండటంతో ప్రేక్షకుల ఫోకస్ అంతా అటువైపే ఉంటుందని సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత రిలీజ్ డేట్‌పై అనేక చర్చలు జరిగాయి. చిత్ర దర్శక, నిర్మాతలు, హీరో, డిస్ట్రిబ్యూటర్లు కలిసి పలు డేట్‌లపై చర్చించారు. తర్వాత ఎన్నికలు ముగిసిన అనంతరం.. అంటే మే 30న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, అప్పటికీ ఎన్నికల హడావిడి ఉంటుంది. అందుకే ఎన్నికల తంతు పూర్తిగా ముగిసిన తర్వాత జూన్ 27న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలోని తొలి పాటను మే 1న విడుదల కానుంది. ఆ తర్వాత వరుసగా సినిమా ప్రమోషన్లు షురూ చేయబోతుంది చిత్ర యూనిట్.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది. ఇండియన్ లాంగ్వేజెస్‌తోపాటు విదేశీ భాషల్లోనూ సినిమాను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమాలో దీపికా పదుకొనె, దిశా పఠాని, కమల్ హాసన్, అమితాబ్ కీలక పాత్రల్లో నటించారు. భారతీయ పురాణలు, సైన్స్ ఫిక్షన్ అంశాలు మేళవించి.. అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.
All the forces come together for a better tomorrow on 𝟐𝟕-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/xws41MNLQP
— Kalki 2898 AD (@Kalki2898AD) April 27, 2024