Kalki 2898 Ad: ఫుల్‌స్టాప్‌.. కల్కి రిలీజ్‌ రూమర్లకు చెక్

ఎన్నికల నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు. పలు కారణాల వల్ల దీని విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ విడుదల తేదీపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ మూవీ టీం చెక్‌ పెట్టనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2024 | 02:21 PMLast Updated on: Apr 18, 2024 | 2:21 PM

Prabhas Kalki 2898 Ad Release Date Will Announce Soon Prabhas Kalki 2898 Ad Release Date Will Announce Soon

Kalki 2898 Ad: రెబల్ స్టార్‌ ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్‌ సినిమా కల్కి 2898 ఏడీ సినిమా విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తొలుత ఈ సినిమా వచ్చే మే 9న విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు. పలు కారణాల వల్ల దీని విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ విడుదల తేదీపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

Pushpa 2 The Rule : పుష్పరాజ్ దెబ్బకి ‘బాహుబలి-2’ ఔట్

అయితే ఈ రూమర్లన్నింటికీ మూవీ టీం చెక్‌ పెట్టనుంది. ఈ విషయమై కల్కి మూవీ టీం గురువారం డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం కానుంది. ఈ సమావేశం పూర్తయిన తర్వాత విడుద తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ విడుదల తేదీ మరింత ఆలస్యం అయినా కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ డేట్‌ని ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ సాయంత్రానికి ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మితమైన సంగతి అందరికీ తెలిసిందే. మైథలాజికల్‌, సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో అశ్విన్‌ ఈ సినిమాని తెరకెక్కించారు.

రామాయణం, మహాభారతం లాంటి వాటిని ఆధారంగా చేసుకుని వేల సంవత్సరాల క్రితం మొదలైన కథకు టైమ్‌ ట్రావెల్‌ని జోడించి ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వారు చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె, దిశా పటానీలు నాయికలుగా నటించారు. బిగ్‌బీ అమితాబచ్చన్‌, కమల్‌హాసన్‌ లాంటి సీనియర్‌ నటులు కూడా ఈ సినిమాలో నటించారు.