Devara vs kslki : ఎన్టీఆర్ ‘దేవర’కు పోటీగా ప్రభాస్ ‘కల్కి’..!

ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన 'దేవర' (Devara) మూవీ.. వీఎఫ్ఎక్స్ వర్క్ మరియు ఇతర కారణాల వల్ల అక్టోబర్ 10కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే జూన్ లేదా జులై నాటికే 'దేవర' ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని.. కానీ సరైన సోలో డేట్ దొరక్కపోవడంతో అక్టోబర్ లో విడుదల చేయాలని నిర్ణయిచుకున్నారని న్యూస్ వినిపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2024 | 11:42 AMLast Updated on: Mar 19, 2024 | 11:42 AM

Prabhas Kalki To Compete With Ntrs Devara

ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ‘దేవర’ (Devara) మూవీ.. వీఎఫ్ఎక్స్ వర్క్ మరియు ఇతర కారణాల వల్ల అక్టోబర్ 10కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే జూన్ లేదా జులై నాటికే ‘దేవర’ ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని.. కానీ సరైన సోలో డేట్ దొరక్కపోవడంతో అక్టోబర్ లో విడుదల చేయాలని నిర్ణయిచుకున్నారని న్యూస్ వినిపించింది. అంతేకాదు, ఒకవేళ ఆగస్టు 15న విడుదల కావాల్సిన ‘పుష్ప-2’ (Pushpa-2) వాయిదా పడితే.. ఆ తేదికి రావాలని ‘దేవర’ టీం భావిస్తోందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ తేదీ విషయంలో ‘దేవర’కి పోటీగా ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) వస్తుందని తెలుస్తోంది.

‘కల్కి 2898 AD’ సినిమాని మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ మే నెలలో జనరల్ ఎలక్షన్స్ ఉండటంతో.. వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో మేకర్స్ కొత్త విడుదల తేదీని వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వారి కన్ను ఆగస్టు 15 పై పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ ‘పుష్ప-2’ వాయిదా పడితే.. ఆ డేట్ కి రావాలని చూస్తున్నారట.

మరోవైపు అసలు ‘పుష్ప-2’ వాయిదా పడుతుందా లేదా అనే సస్పెన్స్ కూడా కొనసాగుతోంది. ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా.. మూవీ టీం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 కే వస్తామని బల్ల గుద్ది మరీ చెబుతోంది. అయితే ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలను అంత తేలికగా నమ్మలేని పరిస్థితి నెలకొంది. చివరి నిమిషంలో సడెన్ గా పోస్ట్ పోన్ అని ప్రకటించినా ఆశ్చర్యంలేదు. అందుకే ఆగస్టు 15 పైన ఇతర భారీ సినిమాలు కూడా ఓ కన్నేసి ఉంచుతున్నాయి. ఇప్పటికే ఆ డేట్ పై ‘దేవర’ కన్ను పడగా.. ఇప్పుడు ‘కల్కి’ కన్ను కూడా పన్నినట్లు వినికిడి. ఒకవేళ నిజంగానే ‘పుష్ప-2’ వాయిదా పడితే.. ఆ తేదీని ‘కల్కి’ కోసం ‘దేవర’ త్యాగం చేస్తుందా లేక ‘దేవర’ ముందే ఆ తేదీపై కన్నేసింది కాబట్టి ‘కల్కి’ మరో కొత్త తేదీని చూసుకుంటుందా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.