Kalki : ‘కల్కి’కి నష్టాలు తప్పవా..
ప్రభాస్ తాజా చిత్రం 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.. జూన్ 27న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది.
ప్రభాస్ తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.. జూన్ 27న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.800 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. 1000 కోట్ల మార్క్ దిశగా పయనిస్తోంది. ఇప్పటికే ఓవరాల్ బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. అయితే ఒక్క ఏరియాలో మాత్రం ‘కల్కి’ నష్టాలను చూసే అవకాశం కనిపిస్తోంది.
సీడెడ్ లో ‘కల్కి’ చిత్రం రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే అక్కడ బయ్యర్లు లాభాలు చూడాలంటే రూ.27 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే పది రోజుల్లో రూ.17 కోట్లకు పైగా షేర్ మాత్రమే రాబట్టగలిగింది. అంటే ఇంకా కనీసం పది కోట్ల షేర్ వసూలు చేయాలి. కానీ అంత మొత్తం కలెక్ట్ చేయడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరో రూ.3-4 కోట్లతో.. ఫుల్ రన్ లో రూ.20 కోట్లకు అటుఇటుగా షేర్ రాబట్టే ఛాన్స్ ఉంది అంటున్నారు.
ఎంత పెద్ద సినిమా అయినా.. ఈరోజుల్లో సెకండ్ వీకెండ్ తర్వాత కలెక్షన్లు బాగా డ్రాప్ అవుతాయి. పైగా సీడెడ్ లో మాస్ సినిమాలకు, కమర్షియల్ సినిమాలకు పెద్దపీట వేస్తుంటారు. సైన్స్ ఫిక్షన్ జానర్ కి అక్కడ రూ.20 కోట్ల షేర్ రావడం అనేది చాలా పెద్ద విషయం. ఆ పరంగా చూస్తే ‘కల్కి’ మంచి వసూళ్లే రాబట్టినప్పటికీ.. రూ.27 కోట్ల భారీ బిజినెస్ కారణంగా అక్కడ నష్టాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.