Prabhas: డార్లింగ్ ప్రేమకథ.. హిమాలయ వీరుడిగా ప్రభాస్..

ప్రభాస్‌తో సీతారామం ఫేం హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్న మూవీ తాలూకు కాన్సెప్ట్. ఇంకా ప్రాజెక్టే ఓకే కాలేదు, అప్పుడే కథ ఎలా లీకైందనే ప్రశ్నేవృథా. ఎందుకంటే రీసెంట్‌గా ప్రభాస్‌కి హను రాఘవ పూడి వినిపించిన స్టోరీ లైన్ ఇలాగే ఉందని లీకైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 22, 2023 | 12:24 PMLast Updated on: May 22, 2023 | 12:24 PM

Prabhas Locks Yet Another Massive Project With Hanu Raghavapudi

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హిమాలయాల్లో తపస్సు చేస్తుంటే.. జీన్స్ వేసుకున్న ఓ తెలుగమ్మాయి తన మీద మనసు పారేసుకుంటే ఎలా ఉంటుంది! ఇది ప్రభాస్‌తో సీతారామం ఫేం హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్న మూవీ తాలూకు కాన్సెప్ట్. ఇంకా ప్రాజెక్టే ఓకే కాలేదు, అప్పుడే కథ ఎలా లీకైందనే ప్రశ్నేవృథా. ఎందుకంటే రీసెంట్‌గా ప్రభాస్‌కి హను రాఘవ పూడి వినిపించిన స్టోరీ లైన్ ఇలాగే ఉందని ఫిల్మ్ నగర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ల చర్చల్లో లీకైంది. ఇంకా చెప్పాలంటే మహాభారతంలో అశ్వథ్థామ చేసిన పాపానికి, శాపంగా మరణం లేని ఘోర జీవితం ఇస్తాడు కృష‌్ణుడు. అయితే అదే అశ్వథ్థామతో జీవించాల్సిన మహిళ మాత్రం మరణిస్తూ, మళ్లీ జన్మిస్తూ తనతోనే ప్రేమలో పడుతూ ఉంటుంది.

ఇలా తనకి శాపవిమోచనం కలిగించే మహిళగా ఈ కాలంలో తను మళ్లీ జన్మిస్తే, వేల ఏళ్లుగా హిమాలయాల్లో తిరిగే అశ్వథ్థామ, తనతో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే స్టోరీ లైన్‌తో గట్టిగానే ఏదో ప్లాన్ చేస్తున్నాడట హను రాఘవపూడి. అయితే ప్రభాస్‌కి చెప్పిన 8 కాన్సెప్టుల్లో ఇది కూడా ఒకటని ప్రచారం జరుగుతోంది.