PRABHAS: ప్రభాస్ షూటింగులన్నీ బంద్.. మోకాలి ఆపరేషన్ కోసమేనా..?
ప్రభాస్ చాలాకాలంగా నొప్పితో బాధపడుతున్నా యాక్టింగ్ ఆపలేదు. రిలీజ్‌కు రెడీగా వున్న సలార్, కల్కిని పూర్తి చేయాలనుకున్నాడు. సలార్ షూటింగ్ పూర్తయినా కల్కి షూటింగ్ బ్యాలెన్స్ వుండిపోయింది. బాహుబలి షూటింగ్‌లో మోకాలికి తగిలిన దెబ్బ ఇప్పటికీ ప్రభాస్‌ను ఇబ్బందిపెడుతూనే వుంది.
PRABHAS: ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ ఆగిపోయాయి. కల్కి షూటింగ్ చివరి దశకు వచ్చినా ఇప్పట్లో షూటింగ్ వుండదు. చేతిలో వున్నసినిమాలన్నింటినీ ప్రభాస్ పక్కన పెట్టాల్సి వచ్చింది. కారణం.. ప్రభాస్ మోకాలి నొప్పి మళ్లీ తరగబెట్టడమే. నిజానికి ప్రభాస్ చాలాకాలంగా నొప్పితో బాధపడుతున్నా యాక్టింగ్ ఆపలేదు. రిలీజ్‌కు రెడీగా వున్న సలార్, కల్కిని పూర్తి చేయాలనుకున్నాడు. సలార్ షూటింగ్ పూర్తయినా కల్కి షూటింగ్ బ్యాలెన్స్ వుండిపోయింది.
బాహుబలి షూటింగ్‌లో మోకాలికి తగిలిన దెబ్బ ఇప్పటికీ ప్రభాస్‌ను ఇబ్బందిపెడుతూనే వుంది. లండన్‌లో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రెస్ట్ తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొంటే నొప్పి మళ్లీ తిరగబెట్టింది. ఈ మధ్యకాలంలో ప్రభాస్ కుంటుతూ నడవడం చూశాం. ఆదిపురుష్ ప్రమోషన్ టైంలో కృతిసనన్ చేయి పట్టుకుని షూ వేసుకున్నాడు. డార్లింగ్‌కు ఏమైందంటూ పెద్ద చర్చే జరిగింది. మోకాలు నొప్పితో బాధపడుతున్న ప్రభాస్ ఆమధ్య నెల రోజులపాటు షూటింగ్‌కు దూరంగా వున్నాడు. అమెరికా వెళ్లి నెల రోజులపాటు ఫిజియో థెరపీ చేయించుకున్నాడు. అదే సమయంలో అక్కడే జరిగిన కల్కి గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని ఇండియా తిరిగొచ్చాడు. ఫిజియోథెరపీ నుంచి తాత్కాలిక ఉపశమనం లభించినా పూర్తిగా రికవర్ కాలేదట. ప్రస్తుతం ప్రభాస్ మోకాలి ఆపరేషన్ కోసం యూరప్ వెళ్లాడు. మూడు నెలలపాటు రెస్ట్ తీసుకుని సలార్ ప్రమోషన్‌తో మళ్లీ బైటకొస్తాడట. ప్రభాస్ కనిపించాలంటే సలార్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాలి.
కోలుకున్నాక సలార్ ప్రమోషన్‌లో పాల్గొని, కల్కి షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. తర్వాత మారుతి సినిమా పూర్తి చేసి, మేలో సందీప్ వంగా డైరెక్షన్‌లో స్పిరిట్ మూవీలోకి అడుగుపెడతాడు ప్రభాస్. మరోవైపు స్పిరిట్ మూవీ జూన్ నుంచి సెట్స్ పైకి వెళుతుందని బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత భుషణ్ కుమార్ వెల్లడించాడు. ‘స్పిరిట్’ ఓ యునిక్ సినిమా అని.. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని ప్రకటించాడు. దీంతో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.