Prabhas: రాజాసాబ్.. ఆ రేంజ్‌లో ఉంటుందా.. అంచనాలు పెంచేస్తున్న నటుడి కామెంట్స్

రెగ్యుల‌ర్ సీరియ‌స్ జోన‌ర్‌లో డార్లింగ్‌ను చూసీ చూసీ అలిసిపోయిన ఫ్యాన్స్‌కు ఈ మూవీ అనౌన్స్‌మెంట్ బిగ్ రిలీఫ్‌ను ఇచ్చింది. దీంతో.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. వింటేజ్ ప్ర‌భాస్‌ను క‌ళ్లారా ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2024 | 01:13 PMLast Updated on: Mar 09, 2024 | 1:13 PM

Prabhas Movie The Raja Saab Will Create Wonders At Box Office Its Full Meals For Fans

Prabhas: యంగ్ రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్ కొన్ని సంవ‌త్స‌రాలుగా ఎదురు చూస్తున్న‌ట్లుగా.. వింటేజ్ లుక్‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్న మూవీ రాజాసాబ్. ఈ మూవీలో ప్ర‌భాస్ ప‌క్కా మాసివ్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవలే ఈ మూవీ టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేస్తూ మూవీని అధికారికంగా ప్రకటించారు. ఇక ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కి సోషల్ మీడియా షేక‌యిపోయింది. లుంగీలో స్టైలిష్ అండ్ మాసివ్ లుక్‌లో డార్లింగ్‌ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రెగ్యుల‌ర్ సీరియ‌స్ జోన‌ర్‌లో డార్లింగ్‌ను చూసీ చూసీ అలిసిపోయిన ఫ్యాన్స్‌కు ఈ మూవీ అనౌన్స్‌మెంట్ బిగ్ రిలీఫ్‌ను ఇచ్చింది.

Pushpa2: పుష్ప‌-2లో మ‌రో స్టార్.. సుకుమార్ ఏం ప్లానింగ‌య్యా సామీ..!

దీంతో.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. వింటేజ్ ప్ర‌భాస్‌ను క‌ళ్లారా ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో రాజాసాబ్ మూవీ గురించి ప్ర‌భాస్ ఫ్రెండ్ శ్రీను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాయి. సలార్‌ మొదటి పార్ట్‌తో బాక్సాఫీస్ బాక్సులు బ‌ద్ద‌లుకొట్టాడు ప్ర‌భాస్‌. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ కల్కి 2898 ఏడీ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కల్కిని పాన్ ఇండియా మూవీ కాదు.. ఇది పాన్ వరల్డ్‌ మూవీ అంటూ ప్రకటించాడు. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌‌తో హాలీవుడ్ రేంజ్‌లో కల్కి సినిమా రూపొందుతుంది. మే 9న రాబోతున్న కల్కి కోసం ఎంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ అంత‌క‌న్నా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై ప్ర‌భాస్‌ శ్రీను చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. రాజా సాబ్ పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్ అని తేల్చి చెప్పాడు. ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రెగ్యులర్ సినిమాలులా ఉండవు.

ఎప్పుడూ చూడని యాంగిల్స్ ఈ సినిమాలో మీరు చూస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్‌లోనూ మరిన్ని అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ డార్లింగ్ ఫ్యాన్స్‌కు విందు భోజ‌నంలా ఫుల్ ట్రీట్ ఇవ్వ‌నుంద‌ని ఇప్ప‌టికే మారుతి ప్ర‌క‌టించాడు. ఈ సినిమాని హార్రర్ బ్యాక్‌డ్రాప్‌తో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మూవీలోని ప్రభాస్ పాత్ర చాలా ఎంటర్టైనింగా ఉంటుందట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రభాస్ కల్కి షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీ బ్యాలన్స్ షూట్ కూడా పూర్తి చేసేయనున్నారు. నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా.. థమన్ సంగీతం అందిస్తున్నారు..