PRABHAS: ప్రభాస్ లేకుండానే మారుతి, కల్కి మూవీలు

రెబల్ స్టార్ మాత్రం తన కొత్త సినిమాల షూటింగ్స్‌కి నో అంటున్నాడట. ఈనెల 18 నుంచి మారుతి మేకింగ్‌లో ప్రభాస్ చేయాల్సిన సినిమా తాలూకు షూటింగ్ మొదలు కాబోతోంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2023 | 08:09 PMLast Updated on: Dec 11, 2023 | 8:09 PM

Prabhas Movies Shooting Commencin Without Him

PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్ లేకుండా తన సినిమాను ఊహించగలమా..? ఇప్పుడు అదే జరుగుతోందా..? అంటే తను పూర్తిగా లేకుండా సినిమాచేస్తే అది ప్రభాస్ మూవీ ఎలా అవుతుంది..? అంటే పూర్తిగా ప్రభాస్ లేకుండా అనలేం కాని.. రెబల్ స్టార్ మాత్రం తన కొత్త సినిమాల షూటింగ్స్‌కి నో అంటున్నాడట. ఈనెల 18 నుంచి మారుతి మేకింగ్‌లో ప్రభాస్ చేయాల్సిన సినిమా తాలూకు షూటింగ్ మొదలు కాబోతోంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తైంది.

Sandeep Reddy Vanga: 300 కోట్ల లాభాలతో లెక్క మార్చిన సందీప్ రెడ్డి వంగ

రాజా డీలక్స్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్‌కి ప్రభాస్ రాకపోవటం వల్ల, తనతో హిందీ హీరో సంజయ్ దత్ కలిసి చేసే సీన్లు సోలోగానే తెరకెక్కించబోతున్నారట. ప్రభాస్ లేకుండా, తన బదులు తన డూప్‌తో సీన్స్ తెరకెక్కిస్తారు. తర్వాత ప్రభాస్ తాలూకు షాట్లను సెపరేట్‌గా తెరకెక్కంచి ఎడిటింగ్‌లో యాడ్ చేస్తారట. లేదంటే ఆ డూప్‌కే డీప్ ఫోటో ఫేకింగ్ టెక్నాలజీ అప్లై చేస్తారేమో అన్న అనుమానాలు పెరిగాయి. ఇక జనవరి 16 నుంచి కల్కి పెండింగ్ షూటింగ్‌ని ప్లాన్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆ షూటింగ్‌కి కూడా ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ లేదట.

తను మోకాలి సర్జరీ తర్వాత కోలుకోలేదా? లేదంటే మరేదైనా కారణం ఉందా? లేదంటే సలార్ రిలీజయ్యాక కూడా తను కొంతకాలం సెట్లో అడుగు పెట్టకూడదనుకుంటున్నాడా..? ఇలాంటి డౌట్లే పెరుగుతున్నాయి తప్ప ఆన్సర్ దొరకట్లేదు.