KALKI 2898 AD: కల్కిలో ప్రభాస్ పాత్ర పేరెంటో తెలుసా..? కొత్త పోస్టర్ రిలీజ్

పాన్ వరల్డ్ లెవల్‌లో ఈ మూవీ వచ్చే మే 9న విడుదల కానుంది. చిత్ర విడుదలకు కొద్ది రోజులే ఉండటంతో ప్రమోషనల్ యాక్టివిటీస్ పెంచింది మూవీ టీం. దీనిలో భాగంగా, శివరాత్రిని పురస్కరించుకుని ప్రభాస్ స్పెషల్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 8, 2024 | 06:15 PMLast Updated on: Mar 08, 2024 | 6:15 PM

Prabhas Name In Kalki 2898 Ad Released With New Poster

KALKI 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. పాన్ వరల్డ్ లెవల్‌లో ఈ మూవీ వచ్చే మే 9న విడుదల కానుంది. చిత్ర విడుదలకు కొద్ది రోజులే ఉండటంతో ప్రమోషనల్ యాక్టివిటీస్ పెంచింది మూవీ టీం. దీనిలో భాగంగా, శివరాత్రిని పురస్కరించుకుని ప్రభాస్ స్పెషల్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అంతేకాదు.. ఈ సినిమాలో ప్రభాస్ పేరు భైరవ అని కూడా రివీల్ చేసింది.

Rihanna: ఒక్క పాట.. రూ..75 కోట్లు.. దటీజ్ రిహన్నా

సంథింగ్ స్పెషల్ అనిపించే గ్లాసెస్ ధరించి తలకు జుట్టు, టాటూతో ప్రభాస్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్రస్తుతం ఈ లుక్ ప్రభాస్ అభిమానుల్ని, ఆడియెన్స్‌ను అరలిస్తోంది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ లుక్ వైరల్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాల మేళవింపుగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని మహానటి ఫేం నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడు. ఇండియాలోనే అత్యంత బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీ ఇది. ప్రభాస్‌తోపాటు విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, దీపికా పదుకొనె, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో ఈ చిత్ర పాట షూట్ చేశారు.

దీంతో షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీ దత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తోపాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.