PRABHAS: ప్రభాస్ ఆదాయం రూ.241 కోట్లకు చేరిందా..?

రెండేళ్లుగా మినిమమ్ రూ.241 కోట్లు ఆర్జిస్తున్నాడట ప్రభాస్. ఇది రూ.121 కోట్లకు ఆల్‌మోస్ట్ డబుల్. అంతేకాదు.. సలార్‌కి తను ఏకంగా రూ.150 కోట్ల రెమ్యేనరేషన్ తీసుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 07:24 PMLast Updated on: Dec 21, 2023 | 7:24 PM

Prabhas Net Worth And Earning Details Are Here

PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్ ఆదాయం 8 ఏళ్లలో 95 శాతం పెరిగి రూ.241 కోట్లుచేరుకుందట. తను బాహుబలికి ముందు వరకు ఏడాదికి రూ.120 కోట్ల ఆదాయం ఆర్జించే వాడని తెలుస్తోంది. ఎక్కువగా సినిమాలతోనే తను ఇంతగా ఆర్జించే వాడని తెలుస్తోంది. 2014 ఏడాదిలో ప్రబాస్ ఏడాది ఆదాయం రూ.124 కోట్లు. అది కూడా తనకున్న స్థిరాస్తి కాకుండా అన్ని అసెట్స్ వల్ల వచ్చే ఆదాయం కలిపితే అంతని తేలింది.

SALAAR: సలార్‌కి పోటీ ఇచ్చే సత్తా.. డంకీ, ఆక్వామ్యాన్ 2కి లేదా..?

ఇక రెండేళ్లుగా మినిమమ్ రూ.241 కోట్లు ఆర్జిస్తున్నాడట ప్రభాస్. ఇది రూ.121 కోట్లకు ఆల్‌మోస్ట్ డబుల్. అంతేకాదు.. సలార్‌కి తను ఏకంగా రూ.150 కోట్ల రెమ్యేనరేషన్ తీసుకున్నాడు. అలానే కల్కి 2898 ఏడీ మూవీకి కూడా తను ఏకంగా రూ.150 కోట్లు తీసుకున్నాడట. సాహోకి రూ.120 కోట్లు, రాధేశ్యామ్, ఆదిపురుష్‌కి రూ.130 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నాడు. 150 కోట్ల రెమ్యునరేషన్ రీచ్ అయిన తొలి భారతీయుడు కూడా ప్రభాసే. సూపర్ స్టార్ రజినీకాంత్ హయ్యెస్ట్ పేమెంట్ రూ.140 కోట్లని తెలుస్తోంది. ఇక షారుఖ్, సల్మాన్, ఆమిర్, అక్షయ్, అంతా ప్రభాస్ తరవాతే.

కాకపోతే ప్రభాస్‌కి సినిమాతో వచ్చే ఆదాయం తప్ప మరో వనరు లేదు. ఇటలీలో తనకున్న లగ్జరీ ఫ్లాట్ వల్ల ఏడాదికి ఐదు కోట్లు రెంట్ రూపంలో ఆదాయం సమకూరుతోంది. కొత్తగా యాడ్ ఎండోర్స్‌మెంట్స్ వల్ల కూడా ఏడాదికి రూ.60 కోట్లు తనకి ఆదాయంగా దక్కుతున్నాయి. ఇక తన ఇంట్లో కోటి విలువచేసే రేంజ్ రోవర్, రెండు కోట్లు విలువ చేసే సెవన్ సిరీస్ బీఎమ్ డబ్ల్యూ కార్, అలానే 2 కోట్లు విలువ చేసే మెర్సిడేస్ బెంజ్‌తోపాటు రూ.8కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంథమ్ ఉంది.