Kalki 2898 AD : బుజ్జితో కలిసే ప్రభాస్
సలార్ (Salaar) తర్వాత ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ బాక్సాఫీసు ని షేక్ చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Prabhas' next film after Salaar is Kalki 2898 AD.
సలార్ (Salaar) తర్వాత ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ బాక్సాఫీసు ని షేక్ చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుంది. దీంతో… చిన్నగా మూవీపై బజ్ పెరుగుతోంది. మేకర్స్.. మరింత బజ్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే పాన్ ఇండియా లెవల్ లో ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాపై అభిమానుల్లో రోజురోజుకు హైప్, క్యూరియాసిటీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రభాస్, దీపికా పదుకొనే (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ నటించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా నిర్మాతలు బుజ్జి (Bujji), భైరవ చుట్టూ ప్రమోషన్‌లను రూపొందిస్తుండటం విశేషం. ప్రభాస్ తన అన్ని ప్రమోషన్లలో బుజ్జి వాహనాన్ని చేర్చాలని అనుకుంటున్నారట.
భవిష్యత్ ప్రచార కార్యక్రమాల కోసం ప్రభాస్ బుజ్జిలో తిరుగుతాడని సమాచారం. బుజ్జి, భైరవ (Bhairava) ఈవెంట్ కోసం మేకర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో జతకట్టారు. దీనికి సంబంధించిన ప్రోమో నిన్ననే విడుదలైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 AD, కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న వైజ్ఞానిక కల్పనా చిత్రం. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. కల్కి 2898 AD జూన్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.