PRABHAS SPIRIT: ప్రభాస్ స్పిరిట్.. ఈసారి యానిమల్‌ను మించి..!

‘యానిమల్’ ఇచ్చిన జోష్​తో రెబల్ స్టార్ ప్రభాస్​తో ‘స్పిరిట్’ తీసేందుకు రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగా. ప్ర‌భాస్ క‌టౌట్‌కు, సందీప్ వంగా టేకింగ్ యాడైతే ఇక ఆ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో.. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2024 | 01:00 PMLast Updated on: Feb 27, 2024 | 6:24 PM

Prabhas Next Movie Spirit With Sandeepreddy Vanga Will Come An Adult Movie

PRABHAS SPIRIT: ‘యానిమల్’.. ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో ఈ మూవీ సృష్టించిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. మాస్ ప్రేక్ష‌కుల ప‌ల్స్ ప‌ట్టుకున్న ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్​తో బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఈ చిత్రంతో స్టార్​గా ఉన్న రణ్​బీర్ కపూర్ కాస్తా సూపర్​స్టార్​గా మారారు. ఆయనలోని నటనా పటిమకు, దర్శకుడు సందీప్​రెడ్డి వంగా టేకింగ్, రైటింగ్​కు అందరూ ఫిదా అయ్యారు. అయితే.. ఈ మూవీ విప‌రీత‌మైన నెగ‌టివిటీని కూడా మూట‌గ‌ట్టుకుంది. కంటెంట్​ను ఇంత బోల్డ్​గా ప్రెజెంట్ చేయడం ఏంటనే కామెంట్స్ వినిపించాయి. అయితే.. ఇవ‌న్నీ యానిమ‌ల్ సక్సెస్ హవాలో కొట్టుకుపోయాయి.

hyderabad drugs: అప్పుడు అక్క.. ఇప్పుడు చెల్లి.. ఈసారి బజ్జీలు కాదు.. డ్రగ్సే..

‘యానిమల్’ ఇచ్చిన జోష్​తో రెబల్ స్టార్ ప్రభాస్​తో ‘స్పిరిట్’ తీసేందుకు రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగా. ప్ర‌భాస్ క‌టౌట్‌కు, సందీప్ వంగా టేకింగ్ యాడైతే ఇక ఆ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో.. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కాగా.. లేటెస్ట్‌గా యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ చేసిన వ్యాఖ్యలతో అంచనాలు పెరిగాయి. ‘స్పిరిట్’ సినిమా విషయంలో ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వస్తున్న వార్తలు మూవీపై ఎక్స్​పెక్టేషన్స్​ను అంత‌కంత‌కూ మరింతగా పెంచేస్తున్నాయి. సందీప్​రెడ్డి వంగా ఈసారి మరింత బోల్డ్​గా, చాలా డార్క్​గా చిత్రాన్ని తీసేందుకు సిద్ధమవుతున్నాడ‌ని తెలుస్తోంది. డిఫరెంట్ విజన్​తో మునుపెన్నడూ చూడనటువంటి ఓ కథతో ‘స్పిరిట్​’ను రూపొందిస్తున్నాడంటూ ఓ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇలాంటి టైమ్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చేసిన కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. యానిమల్ మూవీకి మించి స్పిరిట్ ఉంటుందంటూ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు. మ్యూజిక్ విషయంలో కూడా యానిమల్‌ను మించిపోద్దని చెప్పారు. దీంతో.. ఆడియెన్స్ మతి పోగొట్టే మ్యూజిక్‌తో అదరగొట్టే హర్షవర్ధన్ స్పిరిట్‌లోనూ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తార‌ని డార్లింగ్ ఫ్యాన్స్ సంబ‌ర‌పడిపోతున్నారు.

స్పిరిట్ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ప్రభాస్​తో తీస్తున్న ‘స్పిరిట్​’ విషయంలోనూ సందీప్​ వంగా తగ్గేదేలే అంటున్నాడ‌ట‌. ప్రభాస్‌తో మూవీని రా అండ్ పవర్​ఫుల్ యాక్షన్ ఫిల్మ్​గా తీయనున్నట్లు ఇప్ప‌టికే ఓ ఇంట‌ర్వ్యూలో వంగా బ‌య‌ట‌పెట్టేశాడు. ఈ సినిమా పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్​ను కూడా ఇచ్చేశాడు. ఈ సారి డార్క్ థీమ్​తో, డిఫరెంట్ విజన్​తో తీస్తున్న మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ కంటే ముందే పెద్దలకు మాత్రమే అని ఫిక్స్ అయిపోవాలంటూ హింట్ ఇచ్చేశాడు. దీంతో ‘స్పిరిట్​’లో వయొలెన్స్​ను ఎక్స్​ట్రీమ్ లెవల్లో చూపించడం ఖాయమన్న టాక్ న‌డుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవల్లో ఉంటాయని, ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఇప్ప‌టికే ఫిక్స‌యిపోయారు. మ‌రి.. ప్ర‌భాస్‌- సందీప్ వంగా కాంబోలో మ‌రింత బోల్డ్‌గా రాబోతున్న ఈ మూవీ ఎలాంటి ర‌చ్చ చేయ‌బోతోందో చూడాల్సిందే.